మహీంద్రా రోడియో ఇప్పుడు డ్యూయెల్ కలర్ ఆప్షన్‌తో లభ్యం

Mahindra Rodeo Dual Colour
ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' ప్రధానంగా యువతను దృష్టిలో ఉంచుకొని అందిస్తున్న స్కూటర్ 'రోడియో'లో తాజాగా కొత్త వేరియంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మహీంద్రా రోడియో స్కూటర్ రెండు రెంగుల కలయిక (డ్యూయెల్ టోన్) ఆప్షన్‌తో లభ్యమవుతుంది.

రోడియో స్కూటర్‌లో స్కార్లెట్ బ్లాక్, స్టెర్లింగ్ బ్లాక్ అనే డ్యూయెల్ టోన్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను మహీంద్రా టూవీలర్స్ విడుదల చేసింది. సరికొత్త స్టైల్, లుక్ కలిగిన ఈ రెండు లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లు కూడా 124.6సీసీ ఇంజన్‌ను కలిగి ఉండి 8 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని విడుల చేస్తాయి. రోడియో స్కూటర్‌లో డిజిటల్ డిస్‌ప్లే (స్పీడోమీటర్) ప్రధాన ఆకర్షనగా నిలువనుంది.

ఆకర్షనీయమైన గ్రాఫిక్స్, ఏరోడైనమిక్ డిజైన్, ఆకట్టుకునే రంగులతో ఇది లభిస్తుంది. ఇందులో అమర్చిన శక్తివంతమైన సూపర్‌చార్జ్‌డ్ బ్యాటరీ కారణంగా స్పష్టమైన హారన్ సౌండ్, కాంతివంతమైన హెడ్‌ల్యాంప్, తక్షణ స్టార్ట్ వంటి సదుపాయాలను పొందవచ్చు. ఇందులో ఉన్న యాంటీ-థెఫ్ట్ మ్యాజిక్ కీ ద్వారా మీ రోడియో స్కూటర్‌ను దొంగల బారిన పడకుండా కాపాడవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, November 28, 2011, 16:24 [IST]
English summary
Check out the strikingly stunning and mesmerizing dual colour combinations of Mahindra Rodeo. Both the elegant Sterling Black and the radiant Scarlet Black variants are sure to stir up excitement on the streets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+