మీ కారు భద్రత ఇప్పుడు మీ అరచేతుల్లో

మీ కారును మీ మిత్రులకు ఇచ్చినప్పటీ, అది ఎక్కడ ఉంది, ఏ స్థితిలో ఉంది, కారులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, కారు ఏ రూట్లో వెళ్తుంది వంటి విషయాలను మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రోబోటిక్‌వేర్స్ అనే సంస్థ తొలిసారిగా భారత్‌లో తయారనై జిపిఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందిస్తోంది. ఈ సిస్టమ్ ఇగ్నిషన్ కంట్రోల్, లైవ్ ఎస్ఎమ్ఎస్ (డెలివరీ సమయం 15 సెకన్లు) అందిస్తుంది.
లైవ్ ట్రాకింగ్
లైవ్ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా మీ కారు భారతదేశంలో ఏ మూల దాక్కున్నా సరే ఖచ్చితంగా స్థలంతో సహా గుర్తించే అవకాశం ఉంటుంది.
టైమ్ అండ్ స్పీడ్
మీ కారు ఎంత వేగంతో వెళ్తుందనే వివరాలను తెలుసుకోవచ్చు. ఇది మీ కారు ప్రయాణిస్తున్న వేగాన్ని తెలియజేస్తూ ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ఎంత సమయంలో చేరుకుందో తెలుసుకోవచ్చు.
ఎస్ఎమ్ఎస్ అలెర్ట్స్
ఎవరైనా మీ కారు డోరును బలవంతంగా ఓపెన్ చేయాలని ప్రయత్నించినా, ఇంజన్‌ను ఆన్ చేయాలని ప్రయత్నించినా వెంటే ఈ సిస్టమ్ మీ మొబైల్ ఫోన్ ఎస్ఎమ్ఎస్ ద్వారా సందేశాన్ని పంపించి దొంగతనాల నుండి రక్షిస్తుంది.
అధ్యయనం కోసం రిపోర్టులు
ఈ సిస్టమ్ ద్వారా విశ్లేషణ కోసం రిపోర్టులను పొందవచ్చు. ఉదాహరణకు ప్రతి రోజు మీరు ప్రయాణించిన దూరానికి సంబంధించిన రిపోర్టులను పొందవచ్చు. అన్ని రిపోర్టులను కూడా సింగిల్ క్లిక్‌తో ఎక్స్‌సెల్ ఫార్మాట్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.
రోబోటిక్‌వేర్స్ అందిస్తున్న ఈ జిపిఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ధర, సాంకేతిక వివరాలు వంటి అధనపు సమాచారం కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ (fareye.in)ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








