మహీంద్రా నుంచి సరికొత్త డ్యూరో 125 డిఎక్స్ స్కూటర్

Mahindra Duro 125 DX
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ మహీంద్రా టూవీలర్స్ అందిస్తున్న డ్యూరో స్కూటర్‌లో తాజాగా ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. 125సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన మహీంద్రా డ్యూరో 125 డిఎక్స్ స్కూటర్ సెగ్మెంట్లో ఓ కొత్త ఒరవడిని తీసుకురాగలదని కంపెనీ భావిస్తోంది.

ఇందులో ఉపయోగించిన 124.6సీసీ, 4-స్ట్రోక్ ఇంజన్ సివిటి (కంటిన్యూయస్లీ వేరియబిల్ ట్రాన్సిమిషన్)ను కలిగి ఉండి స్మూత్ రైడ్ అనుభూతిని ఇస్తుంది. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 పిఎస్‌ల శక్తిని, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. కొత్త డ్యూరోలో చెప్పుకోదగిన మార్పు అంటే, ఇందులో కొత్తగా ఏర్పాటు చేసిన టెలిస్కోపిక్ సస్పెన్షన్.

సిటీ రోడ్లపైనే కాకుండా, పల్లె ప్రాంతాల్లో సైతం సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలుగా ఇందులో మెరుగైన సస్పెన్షన్‌ను అమర్చారు. ఇది మంచి ధృడత్వాన్ని కలిగి ఉండి, ఉత్తమ హ్యాండ్లింగ్ అనుభూతిని కల్పిస్తుంది. ఇందులో చెప్పుకోదగిన మరొక అభివృద్ధి ఏంటంటే, బెటర్ రైడింగ్ కోసం అమర్చిన 10 ఇంచ్ వీల్స్ వలన ఇది మంచి రోడ్‌గ్రిప్‌ను కలిగి ఉంటుంది.

కొత్త డ్యూరో 125 డిఎక్స్‌లో ఉన్న 20-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్‌‌లో ఒక హెల్మెట్‌ను పెట్టినప్పటికీ, ఇంకా అందులో చిన్న చిన్న బ్యాగులు, ప్యాకెట్లు వంటివి పెట్టుకునేందుకు కూడా స్థలం మిగిలి ఉంటుంది. ఇదిలా ఉండగా... కంపెనీ అందిస్తున్న మరో స్కూటర్ మహీంద్రా రోడియోలో రెండు సరికొత్త డ్యూయెల్ టోన్ (రెండు రంగులు) వేరియంట్‌లను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Thursday, December 1, 2011, 17:21 [IST]
English summary
Leading utility vehicle manufacturer Mahindra and Mahindra's two-wheeler arm Mahindra 2-Wheelers recently launched its new and improved Duro 125 DX scooter. This scooter is Powered with the 124.6cc 4-stroke engine, which pumps out the power of 8.1 PS 7,000 rpm and torque of 9 Nm 5,500 rpm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+