అల్లాయ్ వీల్స్‌తో మీ కారును మరింత అందంగా మార్చుకోండి!

Alloy Wheels
ఆటోమొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది. సరికొత్త సాంకేతి పరిజ్ఞానం, ఉత్పాదనలు, సాంకేతిక పరికరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతమనేది ఉండదేమో. ప్రతి ఒక్కరూ తమ కారును అందంగా, ఆకర్షనీయంగా కనిపించేలా ఉంచాలనుకుంటుంటారు. ఇందుకోసం కారుకు కంపెనీ ఇచ్చే ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్ కాకుండా ఇతర యాక్ససరీలను అమర్చుకుంటుంటారు.

వాస్తవానికి కంపెనీ అందించే యాక్ససరీలు పరిమితంగా ఉంటాయి లేదా ఆప్షనల్‌గా ఉంటాయి. దీంతో అడిషనల్ ఫిట్టింగ్‌ల కోసం కార్ డెకార్ కంపెనీలను, విడిభాగాలను అమర్చే కంపెనీలను వాహన యజమానులు ఆశ్రయిస్తుంటారు. సరే ఇదంతా అటుంచితే, కారు బయటవైపు నుండి అందగా కనపడాలంటే కేవలం బాడీ గ్రాఫిక్స్ వేయించుకంటే సరిపోదు. ఆకర్షనీయమైన అల్లాయ్ వీల్స్ మీ కారుకు సరికొత్త లుక్‌నిస్తాయి.

అల్లాయ్ వీల్స్ 3-స్పోక్, 4-స్పోక్ ఇలా రకరకాల మోడళ్లలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న కొన్ని ఎంట్రీ లెవల్ కార్లకు అల్లాయ్ వీల్స్ ఉండవు. సాధారణ వీల్స్ కారుకు అంత మంచి లుక్‌ని ఇవ్వలేవు. అదే మెరిసే అల్లాయ్ వీల్స్‌ను అమర్చుకుంటే చవక కారు కూడా కాస్ట్లీ లుక్‌ను ఇస్తుంది. కారు బాడీ రంగులో ఉండే అల్లాయ్ వీల్స్ (తెలుపు, ఎరుపు మొదలైనవి) కూడా ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

అల్లాయ్ వీల్స్ కేవలం లుక్ విషయంలోనే కాకుండా భద్రత విషయంలో కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇవి బ్రేకింగ్ వ్యవస్థలో కీలక పాత్ర పోషించి మెరుగైన బ్రేకింగ్ అనుభూతిని ఇస్తాయి. సాధారణంగా అల్లాయ్ వీల్స్ తేలికగా ఉండి, కారు బరువును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతాయి. ఫలితంగా కారు మైలేజ్ కొద్దిగా పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది.

ఎంచుకునే మోడల్‌‌ను బట్టి అల్లాయ్ వీల్స్ ధరలు ఉంటాయి. మార్కెట్లో రూ.4,000 నుండి లభ్యమవుతాయి. అల్లాయ్ వీల్స్ అమర్చుకోలేని వారు, ప్రస్తుతం ఉన్న సాధారణ వీల్స్‌కే అల్లాయ్ వీల్ లుక్‌నిచ్చే వీల్ క్యాప్స్/వీల్ కవర్స్‌ను ఉపయోగించుకోవచ్చు. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా అల్లాయ్ వీల్స్‌ను ప్రిఫర్ చేయడమే ఉత్తమం.

More from DriveSpark

Article Published On: Monday, December 5, 2011, 15:00 [IST]
English summary
Generally alloy wheels are lighter, more attractive, and better at dissipating brake heat that their steel counterparts. Fitting alloy wheels to a car, normally reduces the weight of car. It will give more sporty look to your car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+