కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు ఎస్ఐఎల్ సన్నాహాలు

అయితే, ఎలాంటి ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నది, ఎప్పుడు ప్రవేశపెట్టనున్నది తదితర వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ గడచిన 9 సంవత్సరాలుగా దివాళ స్థాయిలో నడుస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సానికి సంబంధించి ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు కూడా ఇంకా చెల్లించలేదు. ఈ వేతనాల విలువ సుమారు రూ.4.62 కోట్లు. మార్చి 31, 2011 నాటికి రుణాలు, వడ్డీలు కలిపి రూ.14.42 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.
ఈ బకాయిలు కూడా ఇంత వరకూ చెల్లించలేదు. గతంలో ఒకానొక దశలో ఎస్ఐఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న వాటాలను కూడా విక్రయించాలని ప్రభుత్వం యోచింది. అయితే, ఈ కార్యక్రమం ఇంకా కార్యరూపం దాల్చలేదు. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్‌లో ప్రభుత్వానికి 95.38 శాతం వాటా ఉంది. మిగిలిన వాటాలు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద ఉంది.
మరి ఇలాంటి నష్టాల పరిస్థితిలో కంపెనీ ఎలాంటి ఉత్పత్తులను ప్రవేశపెడుతుందో, ఒకవేళ ప్రవేశపెట్టినప్పటికీ అవి ఎంతమేర విజయం సాధిస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఏదైతేనేం, భారత ఆటోమొబైల్ చరిత్రలో ఓ కొత్త శకానికి తెరలేపిన స్కూటర్స్ ఇండియా కంపెనీకు అంతా మంచే జరగాలని మనమూ కోరుకుందాం.


Click it and Unblock the Notifications








