రాష్ట్ర మార్కెట్లో మహీంద్రా డ్యూరో డిజెడ్ స్కూటర్ విడుదల
హైదారాబాద్: ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెంది ద్విచక్ర వాహన విభాగం "మహీంద్రా టూవీలర్స్" రాష్ట్ర మార్కెట్లోకి సరికొత్త 125సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన గేర్‌లెస్ స్కూటర్ "డ్యూరో డిజెడ్"ను ప్రవేశపెట్టింది. శక్తివంతమైన 125సీసీ ఇంజన్, మెరుగైన మైలేజ్, సౌకర్యవంతమైన సస్పెన్షన్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ కొత్త మహీంద్రా డ్యూరో డిజెడ్ స్కూటర్ సొంతం.
ఈ స్కూటర్‌లో ఎటువంటి రోడ్లపై అయినా కుదుపులు లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన టెలిస్కోపిక్ టైప్ సస్పెన్షన్, రాత్రివేళ్ల మంచి కాంతినిచ్చే హాలోజన్ బల్బ్‌తో కూడిన వెడల్పాటి హెడ్ లైట్, సురక్షితమైన బ్రేకింగ్ కోసం అమర్చిన బ్రేక్ లీవర్ లాక్, వస్తువులను భద్రపరచుకునేందుకు ముందు వైపు స్టోరేజ్ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
అందరికీ అందుబాటులో ఉండేలా ఆకర్షనీయమైన ధరకే కంపెనీ ఈ స్కూటర్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.44,640 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). ఇది లీటరు పెట్రోల్‍కు 53 కి.మీ మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications








