హోండా సిబిఆర్ 250ఆర్‌ను కొనడానికి పది కారణాలు

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ సూపర్‌బైక్ "హోండా సిబిఆర్ 250ఆర్" బైక్‌ను కొనుగోలు చేయడానికి పది కారణాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం..

1. ఇంజన్: ఇందులో ఉపయోగించిన 249.6సీసీ 4-స్ట్రోక్, 4-వాల్వ్ సింగిల్ సిలిండర్ డిఓహెచ్‌సి ఇంజన్ శక్తివంతమైన పెర్ఫామెన్స్ కలిగి ఉండి, అద్భుతమైన రైడింగ్ అనుభూతిని కల్పిస్తుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 25బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 22.9 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

2. సాంకేతిక పరిజ్ఞానం: ఇందులో ఉపయోగించిన ప్రోగ్రామ్డ్ ఫ్యూయెల్ ఇంజన్ సిస్టమ్ (పిజిఎమ్-ఎఫ్) సాంకేతిక పరిజ్ఞానం ఇంజన్ యొక్క పనితనాన్ని మెరుగుపరుస్తుంది.

3. ఏబిఎస్: కొత్త హోండా సిబిఆర్ 250ఆర్ సూపర్‌బైక్‌లో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఓ స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది. అత్యవసర సమయాల్లో బ్రేక్ వేయాల్సి వచ్చిన వీల్‌లాకింగ్ కాకుండా ఆపి, బ్రేక్ దూరాన్ని తగ్గించడంలో ఏబిఎస్ ఉపయోగపడుతుంది.

4. వెనుక డిస్క్ బ్రేక్: మరింత సురక్షితమైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం వెనుక వీల్‌కు సైతం అమర్చిన డిస్క్ బ్రేక్.

5. స్ప్లిట్ సీట్ డిజైన్: సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతి కోసం, స్పోర్టీ లుక్ కోసం మరియు పిలియన్ రైడ్ (వెనుక కూర్చునే ప్రయాణికుడు) చేస్తున్నప్పుడు సరైన బ్యాలెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన స్ప్లిట్ సీట్ డిజైన్, చిన్న చిన్న వస్తువులను దాచుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన అండర్ సీట్ స్టోరేజ్.

6. లో సీట్ హైట్: ఎటువంటి వారికి సరిపోయే విధంగా, నెమ్మదిగా వెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయగలిగే విధంగా, సీటు ఎత్తు తక్కువగా ఉండేటట్లు రూపొందించిన డిజైన్ (సీట్ ఎత్తు 0.780 మీటర్లు).

7. డిజిటల్, అనలాగ్ డిస్‌ప్లే: ఇటు డిజిటల్, అటు అనలాగ్ డిస్‌ప్లేను కలిగి ఉండే ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్. స్పోర్టీ సిల్వర్ కోటింగ్‌తో బ్లూ ఎల్‌సిడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే కలిగిన డిజిటల్ మీటర్.

8. లేయర్డ్ స్టైల్ ఫెయిరింగ్: సరికొత్త బాడీ ప్యానెల్స్, డిజైన్, లుక్, కలర్ ఆప్షన్స్ అండ్ గ్రాఫిక్స్.

9. ప్రోలింక్ రియర్ సస్పెన్షన్: మంచి రోడ్ గ్రిప్ కోసం, బ్యాలెన్సింగ్ కోసం బైక్ మధ్య భాగంలో అమర్చిన మోనో షాక్ అబ్జార్వర్.

10. ఇతరాలు: ఇవే కాకుండా, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, వెడల్పాటి వెనుక టైర్, సరికొత్త ట్రెండీ, స్పోర్టీ సైలెన్సర్, ఆకర్షనీయమైన రియర్ టెయిల్ ల్యాంప్ వంటి ఎన్నో ప్రత్యేకలు ఈ సరికొత్త హోండా సిబిఆర్ 250ఆర్ సూపర్‌బైక్ సొంతం.

రెండు వెర్షన్లలో లభించే హోండా సిబిఆర్ 250ఆర్ సూపర్‌బైక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* హోండా సిబిఆర్ 250ఆర్ (స్టాండర్డ్ వేరియంట్) ఎక్స్-షోరూమ్ హైదరాబాద్ ధర - రూ.1,47,092
* హోండా సిబిఆర్ 250ఆర్ (స్టాండర్డ్ వేరియంట్) ఆన్-రోడ్ హైదరాబాద్ ధర - రూ.1,62,674
* హోండా సిబిఆర్ 250ఆర్ (ఏబిఎస్ వేరియంట్) ఎక్స్-షోరూమ్ హైదరాబాద్ ధర - రూ.1,72,533
* హోండా సిబిఆర్ 250ఆర్ (ఏబిఎస్ వేరియంట్) ఆన్-రోడ్ హైదరాబాద్ ధర - రూ.1,90,691

More from DriveSpark

Article Published On: Wednesday, December 14, 2011, 18:00 [IST]
English summary
The Honda CBR 250R super bike surprised every one with its performance, looks and even its price which is pegged at Rs.1.7 lakhs. It is an affordable 250cc bike and has gote rave reviews. Here is the 10 reasons to buy this smart superbike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+