పది వసంతాలు పూర్తి చేసుకున్న బజాజ్ పల్సర్..

Bajaj Pulsarనాటికి నేటికి ఎన్నో మార్పులు.. అయినా నెంబర్ వన్..
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో సరికొత్త విప్లవాలకు తెరలేపిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో. దశాబ్ధాల కాలం క్రితం స్కూటర్ల విడుదల ద్వారా భారత ప్రజల్లో గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాధించుకున్న బజాజ్ ఆటో, ఆ తర్వాతి కాలంలో మారుతున్న ప్రజల అభిరుచులు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా, అన్ని తరాలను ఆకట్టుకుంటూ వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తూ వచ్చింది.

భారత్‌లో బజాజ్ స్కూటర్లు ఎంత ప్రాచుర్యాన్ని సంపాధించుకున్నాయో, కంపెనీ అందిస్తున్న స్పోర్ట్స్ బైక్ పల్సర్ కూడా అంతే ప్రాచుర్యాన్ని దక్కించుకుంది. తొలుత కమ్యూంటిగ్ ప్రయోజనం కోసం తయారైన ఈ 150సీసీ బైక్ ఆ తర్వాతి కాలంలో క్రమేణా మార్పులు చెందుతూ, వచ్చి ప్రస్తుతం యువత మెచ్చిన భారతదేశపు నెంబర్ వన్ స్పోర్ట్స్ బైక్‌గా నిలిచింది.

ప్రస్తుతం భారత్‌లో అమ్ము ఏ జపనీస్ స్పోర్ట్స్ బైక్‌తో పోల్చుకున్నా దాని కన్నా ఐదు రెట్లు ఎక్కువగా బజాజ్ పల్సర్ బైక్‌లు అమ్మడువుతున్నాయంటే, మనవారు ఈ బైక్‌ను ఎంతగా ఆదరిస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. 2001లో విడుదలై మార్కెట్లో ఓ సంచలనాన్ని సృష్టించిన బజాజ్ పల్సర్ ప్రస్తుతం పది విజయవంతమైన సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

ఇది ఎప్పటికప్పుడు నూతనతను సంతరించుకుంటూ, లుక్, డిజైన్, పవర్, పెర్ఫామెన్స్, మెయింటినెన్స్ వంటి విషయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. తొలుత 150సీసీ, 180సీసీ ఇంజన్ ఆప్షన్‌తో పల్సర్ బ్రాండ్ మోటార్‌సైకిళ్లను బజాజ్ ప్రవేశపెట్టింది. అనంతరం, డిటిఎస్ఐ ఇంజన్, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్స్, ఇలా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నేడు ఈ సెగ్మెంట్లో నెంబర్ వన్‌గా ఉంది.

సరే ఇదంతా అటుంచితే, బజాజ్ పల్సర్ బ్రాండ్‌లో త్వరలోనే మరో సంచలనానికి తెరలేపనుంది. గతంలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించిన దాని ప్రకారం, ప్రపంచంలోనే ఇప్పటి వరకూ ఏ ద్విచక్ర వాహన కంపెనీ పరిచయం చేయని సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ కొత్త బజాజ్ పల్సర్‌లో ప్రవేశపెట్టనున్నామని ప్రకటించారు. ప్రస్తుతం బైక్ లవర్స్ దృష్టంతా కొత్త పల్సర్‌పైనే ఉంది. ఏదైతేనేం విజయవంతమైన పల్సర్ పదేళ్ల సుధీర్ఘ ప్రయాణానికి మనమూ అభినందనలు తెలియజేద్దాం.

More from DriveSpark

Article Published On: Thursday, December 15, 2011, 18:21 [IST]
English summary
Bajaj Auto is celebrating the tenth anniversary of it's popular sport bike Pulsar. Bajaj Auto was launched their first Pulsar motorcycle in 24th November 2001. Now Bajaj Pulsar is still going strong as India's highest selling performance sports bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+