హోండా భవిష్యత్ రవాణా వాహనం: చోపర్ ఈ-బైక్

Honda Chopper
ఈ ఫోటోను చూడగానే ఇదేదో కాన్సెప్ట్ బైక్ అని అర్థమైపోతుంది కదా...! అవును నిజమే ఇదొక కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ బైక్. జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్స్ ఇంజనీర్ల నైపుణ్యతకు అద్దం పట్టే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ పేరు "హోండా చోపర్". ప్రస్తుతం దీని అవసరం మనకు ఉండకపోవచ్చు లేదా దీన్ని ఉపయోగించేందుకు సరైన మౌళిక సదుపాయాలు ఇప్పటికిప్పుడు మనకు అందుబాటులో లేకపోవచ్చు.

మరిన్ని చిత్రాల కోసం డ్రైవ్‌స్పార్క్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను సందర్శించండి:

అయితే, ఒక్కటి మాత్రం ఖచ్ఛితంగా చెప్పవచ్చు. అదేంటంటే, భవిష్యత్తులో ఇలాంటి వాహనాలకే పెద్దపీట వేయటం జరుగుతుంది. ఇక హోండా చోపర్ ఎలక్ట్రిక్ బైక్ కాన్సెప్ట్ విషయానికి వస్తే... ఇది బ్యాటరీ పవర్‌తో నడిచే ఓ హైపవర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఒకటి ముందు టైర్లో ఉండగా, మరొకటి వెనుక టైర్లో ఉంటుంది. ఇవి రెండూ కూడా ఏకకాలంలోనే పనిచేస్తాయి.

డ్రైవ్ స్పార్క్ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్:

ఈ హోండా ఎలక్ట్రిక్ చోపర్‌ను పీటర్ నోరిస్ డిజైన్ చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో తామెంత ముందున్నామో తెలిపేందుకే హోండా ఈ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేసింది. ఇటీవలే జరిగిన ఓ ఆటో షోలో హోండా ఈ ఎలక్ట్రిక్ చోపర్‌ను ఆవిష్కరించింది. అయితే, ఈ మోడల్ ఇప్పట్లో ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశాలేవీ కనబడట్లేదు. ఇక దీని సాంకేతిక మరియు ఇతర వివరాలను వెల్లడించేందుకు మాత్రం కంపెనీ నిరాకరిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 21, 2011, 16:48 [IST]
English summary
Japanese auto major Honda Motors once again proved that, they are more advanced in automobile future mobility technology by unveiling its all new concept electric bike named as Honda Chopper.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+