ద్విచక్ర వాహనాలు నడిపే వారికి సైతం ఎయిర్‌బ్యాగ్‌లు!

కార్లు, ఎస్‌యూవీలు వంటి వాహనాల్లో అత్యాధునిక సాంకేతిక, భద్రతా వ్యవస్థలు ఉంటాయి కాబట్టి, సదరు వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎయిర్‌బ్యాగ్‌లు రశ్రణ కవచంలో డ్రైవర్ ప్యాసింజర్‌లను రక్షిస్తాయి. అయితే, ద్విచక్ర వాహనాల్లో ఈ సదుపాయం లేదు. కానీ టూవీలర్‌పై వెళ్తున్నప్పుడు కూడా ఎయిర్‌బ్యాగ్‌లను ఉపయోగించుకోవచ్చు.
ఇప్పటికే మార్కెట్లో ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన జాకెట్లు (జర్కిన్లు) లభ్యమవుతున్నాయి. బైక్ రేసర్ల కోసం డైనెస్ అనే కంపెనీ ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన "డి-ఎయిర్ ప్రొటెక్షన్" జాకెట్‌ను అందిస్తోంది. శరీరంలో కీలక భాగాలైన భుజాలు, మెడ, ప్రక్కటెములకు ఇది రక్షణ కల్పిస్తుంది. ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనం నుండి క్రింద పడిపోయినా, యాక్సిడెంట్ సంభవించినా ఎయిర్‌బ్యాగ్ జాకెట్లలో అమర్చిన ఎయిర్‌బ్యాగ్‌లు విడుదలై రక్షణను ఇస్తాయి.
అదే కంపెనీ ఇప్పుడు సాధారణ ప్రజల కోసం ఓ స్ట్రీట్ వెర్షన్ ఎయిర్‌బ్యాగ్ జాకెట్‌ను విడుదల చేసింది. "క్రిస్టెన్డెడ్ డి-ఎయిర్ స్ట్రీట్" పేరుతో లభిస్తున్న ఈ ఎయిర్‌బ్యాగ్ జాకెట్‌ను వచ్చే ఏడాది నుండి వాణిజ్య పరంగా కంపెనీ విక్రయించనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ 'డైనెస్'ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








