ప్రీమియం మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో తగ్గిన హీరో అమ్మకాలు

Hero Karzma
ద్విచక్ర వాహన అమ్మకాలలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా మోటార్స్ లిమిటెడ్), ప్రీమియం మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయింది. ఈ సంవత్సరంలో సగటున ప్రతి నెలా 5 లక్షలకు పైగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించిన హీరో మోటోకార్ప్, ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో మాత్రం 30 శాతం తగ్గుదలను నమోదు చేసుకుంది.

ఈ విభాగంలో హీరో మోటోకార్ప్ సిబిజెడ్, కరిజ్మా, హంక్ మరియు తాజాగా విడుదల చేసిన 150సీసీ ఆన్-రోడ్ అండ్ ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ ఇంపల్స్ మోడళ్లను అందిస్తుంది. గడచిన డిసెంబర్ జపాన్ భాగస్వామి హోండా మోటార్ కార్పోరేషన్ నుండి విడిపోయినప్పటి నుండి ఈ విభాగంలో అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్లుగా తెలుస్తోంది.

ఏదేమైనప్పటికీ... ఇదే విభాగంలో బజాజ్, యమహా, హోండా, టీవీఎస్ కంపెనీల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. వాస్తవానికి ఈ కంపెనీలు అందిస్తున్న బడ్జెట్ బైక్‌ల కన్నా ప్రీమియం బైక్‌లకే అధిక ఆదరణ లభిస్తుంది. జనవరి 2011లో 34,116 ప్రీమియం మోటార్‌సైకిళ్లను విక్రయించిన హీరో మోటోకార్ప్, గడచిన నవంబర్ 2011లో 23,860 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.

More from DriveSpark

Article Published On: Monday, December 26, 2011, 15:58 [IST]
English summary
India's largest two-wheeler manufacturer Hero MotoCorp sales has come down over 30 pc in last 11 months premium motorcycle segment. Company is offering CBZ, Karizma and Hunk Impulse in this segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+