ఆఫ్-రోడ్ రేసింగ్ కోసం ప్రపంచపు తొలి ఏబిఎస్ సిస్టమ్

Husqvarna TE 449
ఒకప్పుడు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) కార్లకు మాత్రమే పరిమితమైన భద్రతా (సేఫ్టీ) ఫీచర్. అయితే, మారుతున్న కాలంతో పాటుగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని, ప్రస్తుతం ఈ టెక్నాలజీని ద్విచక్ర వాహనాల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. మనదేశంలో తొలిసారిగా టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న అపాచీ 180 ఆర్‌టిఆర్‌లో పరిచయం చేసింది.

కాగా.. ఇప్పటి వరకూ ఆన్-రోడ్ బైక్‌లకు మాత్రమే పరిమితమైన ఈ ఏబిఎస్ సిస్టమ్ ఇప్పుడు ఆఫ్-రోడ్ బైక్‌లలో కూడా లభ్యం కానుంది. జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూకు చెందిన హస్క్వార్నా మోటార్‌సైకిల్స్ ప్రపంచంలోనే తొలిసారిగా ఓ డర్ట్ బైక్ (అడ్వెంచర్ రైడ్స్, రేసింగ్స్ కోసం ఉపయోగించే బైక్స్)లో ఏబిఎస్‌ను పరిచయం చేసింది.

అత్యంత ప్రమాదంతో కూడుకున్న ఈ అడ్వెంచర్ రైడ్స్, రేస్‌లలో ఉపయోగించే ద్విచక్ర వాహనాల్లో బ్రేకింగ్ వ్యవస్థ ఎంతో ప్రధానమైనది. ఈ నేపథ్యంలో హస్క్వాన్సా మోటార్‌సైకిల్ అందిస్తున్న "టిఈ 449" అనే డర్ట్ బైక్‌లో ఈ ఏబిఎస్ టెక్నాలజీని ఉపయోగించింది. ఏబిఎస్ వ్యవస్థ పనితీరు గురించి క్రింద స్పష్టంగా వివరించబడింది.

ఎబిఎస్ పనితీరు:
సాదారణ బ్రేకింగ్ సిస్టమ్ (డ్రమ్/డిస్క్)లో రోడ్డుపై అత్యవసరంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరిగడం (టైర్ రోలింగ్) ఆగిపోయి టైర్లు రోడ్డపై రాచుకుంటూ, బ్రేకింగ్ దూరం పెరిగి వాహనం జారిపోయే క్రిందపడిపోయే ఆస్కారం ఉంది. అదే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ ఉన్న వాహనాల్లో అయితే, అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరగడం ఆగిపోకుండానే వాహన వేగాన్ని పూర్తిగా నియంత్రించి, బ్రేకింగ్ దూరాన్ని (బ్రేకింగ్ డిస్టాన్స్) తగ్గించి ప్రమాదం నుండి తప్పించుకోవడం జరుగుతుంది.

Article Published On: Monday, December 26, 2011, 17:30 [IST]
English summary
German auto major BMW owned Huswvarna Motorcycles has introduced world's first ABS system for off-road racing model TE 449 dirt bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+