ఇప్పుడు పల్సర్ 135 బైక్‌లో కూడా డ్యూయెల్ కలర్ ఆప్షన్

దేశీయ ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ప్రియులకు ఓ సరికొత్త న్యూఇయర్ గిఫ్ట్‌ను అందిస్తోంది. అదేంటంటే, కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్పోర్ట్స్ బైక్ "పల్సర్" బ్రాండ్‌‌లో లభిస్తున్న 135సీసీ వేరియంట్ బైక్ ఇప్పుడు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.

ఇప్పటి వరకూ నలుపు (బ్లాక్), ఎరుపు (రెడ్) రంగులలో మాత్రమే లభిస్తున్న బజాజ్ పల్సర్ 135 ఇప్పుడు మల్టీ కలర్ ఆప్షన్‌లో కూడా లభ్యం కానుంది. గతంలో 220సీసీ, 150 సీసీ వేరియంట్ బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లలో ప్రవేశపెట్టిన స్పీడ్‌లేన్స్ కలర్ కాన్సెప్ట్‌ను తాజాగా 135 సీసీ పల్సర్‌లో కూడా కంపెనీ పరిచయం చేసింది.

పల్సర్ 135సీసీ డ్యూయెల్ కలర్ బైక్ చిత్రాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ఎరుపు మరియు నలుపు రంగుల కలయిక, బులుగు (బ్లూ) మరియు నలుపు రంగుల కలయికతో కూడిన వేరియంట్లను బజాజ్ ఆటో అందిస్తోంది. ఈ బైక్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయకుండా కేవలం కొన్ని కాస్మోటిక్ మార్పులను మాత్రమే చేసి సరికొత్త కలర్ ఆప్షన్స్‌తో కంపెనీ అందిస్తోంది. మరి పల్సర్ 135 బాడీ గ్రాఫిక్స్ మీకు నచ్చిందా..?

More from DriveSpark

Article Published On: Wednesday, December 28, 2011, 13:56 [IST]
English summary
India's second largest sports bike maker Bajaj Auto is now launched its sports bike Pulsar 135cc with cosmetic changes. The new body graphics add a black red and black blue.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+