మంచి కార్ ఆడియో సిస్టమ్ కొనడంలో సందిగ్ధమా..?

సోనీ ఎక్స్‌ప్లోడ్ సిడిఎక్స్-జిటి45ఐపి:
ఐప్యాడ్ కంపాటబిలిటీతో లభించే 'సోనీ ఎక్స్‌ప్లోడ్ సిడిఎక్స్-జిటి45ఐపి' ఆడియో సిస్టమ్ ధర రూ.8,490 లుగా ఉంది. ఎల్‌సిడి డిస్‌ప్లే కలిగిన ఈ ఆడియో సిస్టమ్ వైర్‌లెస్ రిమోట్‌తో లభిస్తుంది. ఇది నలుపు మెటాలిక్ రంగులలో లభ్యమవుతుంది. ఇందుల సిడి డెక్, ఎఫ్ఎమ్ రేడియో కూడా ఉంది.
పయోనీర్ డీఈహెచ్-7350బిటి
మ్యూజిక్ సిస్టమ్‌లో తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పయోనీర్ అందిస్తున్న లేటెస్ట్ ఆడియో సిస్టమ్ "డీఈహెచ్-7350బిటి". ఇది ఐప్యాడ్, ఐఫోన్, యూఎస్‌బి, బ్లూటూత్ కెనెక్టివితో లభిస్తుంది. అంతేకాదు ఇందులో సిడ స్లాట్ ఆప్షన్ కూడా ఉంది. ఇక దీని ధర రూ.11,990 లుగా ఉంది.
సోనీ ఎమ్ఈఎక్స్-బిటి3580యూ
ఆడియో సిస్టమ్‌లలో సోనీ అందిస్తున్న మరో అద్భుతమైన ఉత్పత్తి "సోనీ ఎమ్ఈఎక్స్-బిటి3580యూ". ఇది ఎమ్‌పి3, ఏఏసి, డబ్ల్యూఎమ్ఏ ఆడియో ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తుంది. సిడి స్లాట్, ఫ్రంట్ యూఎస్‌బి, బ్లూటూత్ సపోర్ట్, ఐప్యాడ్ కంట్రోల్, వైర్‌లెస్ రిమోట్ ఆప్షన్లతో లభించే దీని ధర రూ.12,990 లుగా ఉంది.
కెన్‌వుడ్ కెడిసి-ఎక్స్8016బిటి
సాధారణంగా ప్రస్తుతం కారుతో పాటుగా లభింటే ఆడియో సిస్టమ్‌లలో ఎక్కువగా యూఎస్‌బి, ఆక్సలరీ (ఆక్స్-ఇన్) ఫీచర్లు కలిగిన ఆడియో సిస్టమ్‌లు మాత్రమే స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా వస్తున్నాయి. బ్లూటూత్ ఆప్షన్ కలిగిన ఆడియో సిస్టమ్‌లు చాలా అరుదు. ప్రీమియం వేరియంట్లలో మాత్రమే ఈ ఫీచర్ కలిగిన ఆడియో సిస్టమ్‌లు లభ్యమవుతాయి.
కెన్‌వుడ్ అందిస్తున్న 'కెడిసి-ఎక్స్8016బిటి' మోడల్ ఆడియో సిస్టమ్ ఇన్‌బిల్ట్ బ్లూటూత్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఎలాంటి వైర్లు కనెక్ట్ చేయకుండా మొబైల్ హ్యాండ్ సెట్ ద్వారా సంగీతాన్ని మీ కారులో ఆస్వాదించవచ్చు. ఇది విశాలమైన 5-లైన్ ఎల్‌సిడి డిస్‌ప్లే సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇక దీని ధ విషయానికి వస్తే.. ఇది రూ.19,990 గా ఉంది.


Click it and Unblock the Notifications








