టూ-వీలర్ బిజినెస్‌లో చేతులు కలిపిన యమహా, మహీంద్రా

అలాగే, మహీంద్రా అండ్ మహీంద్రాకు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను యమహా ఉపయోగించుకోనుంది. గడచిన 2008 సంవత్సరంలో హోండా మాజీ భాగస్వామి అయిన కైనటిక్ మోటార్ కంపెనీలో 80 శాతం వాటాలను ఎమ్ అండ్ ఎమ్ రూ.110 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. ఎమ్ అండ్ ఎమ్ ప్రస్తుతం నాలుగు స్కూటర్లను అందిస్తుంది.
కాగా.. మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో స్టాలియో 110 సీసీ బైక్‌ను విడుదల చేసినప్పటికీ, వివిధ లోపాల కారణంగా అది పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో సరైన సాంకేతిక భాగస్వామి కోసం ఎమ్ అండ్ ఎమ్ అన్వేషణ ప్రారంభించింది, ఇందులో భాగంగానే యమహాతో కంపెనీ చేతులు కలిపింది. ఈ కొత్త జాయింట్ వెంచర్ విలువ సుమారు రూ.200 నుంచి రూ.300 కోట్లు ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








