2011 బజాజ్ డిస్కవర్ 100 సీసీ బైక్ ప్రత్యేకతలు, విశిష్టలు

Bajaj Discover
భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ డిస్కవర్‌ బ్రాండ్‌లో ఇటీవలే 100 సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 100 సీసీ విభాగంలో హీరో హోండా అందిస్తున్న స్ప్లెండర్, ప్యాషన్ మోటార్‌సైకిళ్లకు పోటీగా బజాజ్ ఈ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది.

ఆటోమొబైల్ పరిశ్రమలో తొలిసారిగా ఆటో ఛేంజ్ కలర్ ఫీచర్‌ను కొత్త బజాజ్ డిస్కవర్ 100 సీసీ బైక్‌లో ఉపయోగించింది. ఈ టెక్నాలజీ వల్ల బైక్ వివిధ కోణాల్లో చూసినప్పుడు వివిధ రంగుల్లో దర్శనమిస్తుంది. ఈ బైక్‌లో మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే మైలేజ్. మైలేజ్ విషయంలో తమ బైక్‌తో మరే బైక్ పోటీపడలేదని బజాజ్ పేర్కొంది. ఇక బజాజ్ డిస్కవర్ 100 సీసీ మోటార్‌సైకిల్ ప్రత్యేకతలు, విశేషాలేంటో మనమూ ఒక్కసారి పరిశీలిద్దాం రండి...!

ఇందులో ట్విన్‌ స్పార్క్ టెక్నాలజీ ఉండటం వల్ల ఎక్కువ శక్తి నష్టపోకుండా అత్యుత్తమ మైలేజ్‌ను ఇస్తుంది. రైడ్ కంట్రోల్ స్విచ్ ఉండటం వల్ల ఫ్యూయెల్ ఎకానమీ జోన్‌లో రైడ్ చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ బైక్‌లో ఉపయోగించే బ్యాటరీ పూర్తిగా మెయింట్‌నెన్స్ ఫ్రీ, పైగా ఇది ఆరు నెలల అదనపు వారంటీతో లభిస్తుంది. తక్కువ పవర్‌ను ఉపయోగించుకొని ఎక్కువ కాంతినిచ్చే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్‌ ఇందులో మరో ప్రత్యేకత. ఎలక్ట్రిక్ స్టార్ట్ ఉండటం వల్ల ట్రాఫిక్‌జామ్‌లలో వాహనాన్ని పూర్తి ఆపివేసి సిగ్నల్ ఇచ్చిన వెంటనే చటుక్కున ఇంజన్ ఆన్‌ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఆటోచౌక్ ఉండటం వల్ల అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఇంజన్ సులువుగా స్టార్ట్ అవుతుంది.

ఇంజన్:

టైప్ - సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్
డిస్‌ప్లేస్‌మెంట్ (సీసీ) - 94.38cc
కంప్రెషన్ నిష్పత్తి - 9.8 : 01
గరిష్ట పవర్ - 7.7 Ps @ 7500 rpm
గరిష్ట టార్క్ - 7.85 Nm @ 5000 rpm
స్టార్టింగ్ - సెల్ఫ్ స్టార్ట్ / కిక్ స్టార్ట్

ట్రాన్సిమిషన్:

క్లచ్ - వెట్‌ మల్టీప్లేట్
గేర్ల సంఖ్య - 5 (అన్ని గేర్లు కింది వైపుకు)
ఛాస్సిస్ & బాడీ:

ఛాస్సిస్ టైప్ - సింగిల్ డౌన్ ట్యూబ్
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్
వెనుక సస్పెన్షన్ - నిట్రాక్స్
ముందు బ్రేక్ - 130 mm డ్రమ్ బ్రేక్స్
వెనుక బ్రేక్ - 110 mm డ్రమ్ బ్రేక్స్
ముందు టైర్ - 2.75 x 17"
వెనుక టైర్ - 3.00 x 17"
ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 8 లీటర్లు (2.3 లీటర్ రిజర్వ్)

ఎలక్ట్రికల్:

బ్యాటరీ - 12V, 5Ah
హెడ్ ల్యాంప్ - 35 / 35 W
టెయిల్, స్టాప్ ల్యాంప్స్ - ఎల్ఈడి టైప్
హారన్ టైప్ - డిసి

కొలతలు:

పొడవు - 2040 mm
వెడల్పు - 760 mm
ఎత్తు - 1087 mm
వీల్‌బేస్ - 1305 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 162mm
బరువు - 115 Kgs

ఆన్‌రోడ్ మైలేజ్:

సిటీ రోడ్లపై - 82kmpl
హైవే రోడ్లపై - 102kmpl
సగటు మైలేజ్ - 87kmpl
ధర- 42,695(ఎక్స్ షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Saturday, February 26, 2011, 15:56 [IST]
English summary
The second largest two wheeler-maker, Bajaj Auto recently launched its 2011 edition of Discover 100cc bike in Indian market. The new Discover 100cc was developed with Auto Colour Change feature, which give multiple color look in diffrent angles. Here are few details of the all new Bajaj Discover 100cc bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+