సరికొత్త ఫీచర్లతో 2012 హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్!

2012 Honda CBR 1000RR
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా అందిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ మోటార్‌సైకిల్ 'హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్'లో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ 2012 వేరియంట్‌ను విడుదల చేసింది. భారత్‌లోనే కాకుండా, ప్రపంచ మార్కెట్లలో సైతం అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సూపర్‌బైక్ మరికొన్ని అధనపు ఫీచర్లను జోడించి రిఫ్రెష్డ్ వెర్షన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

హోండా ఈ మోడల్‌ను ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు పూర్తికావడంతో ఈ సరికొత్త 2012 హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్‌ను కంపెనీ రూపొందించింది. సిబిఆర్ 1000 సూపర్‌బైక్‌ను తొలిసారిగా 1991లో హోండా విడుదల చేసింది. 2012 ఫైర్‌బ్లేడ్‌ ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా కాస్మోటిక్ మార్పులను చేసి హోండా విడుదల చేసింది.

2012 ఫైర్‌బ్లేడ్‌లో సరికొత్త స్టైలిష్ ఎక్స్టీరియర్ డిజైన్, కొత్త ఫీచర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్, బెటర్ సస్పెన్షన్, బెటర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కాస్మోటిక్ మార్పులను చేసింది. ఈ సూపర్‌బైక్‌కు మరింత స్పోర్టీ లుక్ ఇచ్చేందుకు 12-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. ఈ బైక్ బరువును తగ్గించేందుకు గానూ అల్లాయ్ వీల్స్‌ను తేలికపాటి అల్యూమినియం లోహంతో రూపొందించారు.

2012 ఫైర్‌బ్లేడ్ సూపర్‌బైక్‌కు అమర్చిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ సరికొత్త ఎల్‌సిడి డిస్‌ప్లే సిస్టమ్‌ను కలిగి ఉండి, ల్యాప్ టైమర్, గేర్ ఇండికేటర్, టాకో మీటర్‌లను కలిగి ఉండి నాలుగు డిస్‌ప్లే మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో ఉపయోగించిన 999సీసీ ఫోర్-సిలిండర్ ఎమ్‌పిఎఫ్ఐ ఇన్‌లైన్ పెట్రోల్ ఇంజన్ అధిక శక్తిని కలిగి ఉండి మంచి పెర్ఫామెన్స్ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 27, 2011, 16:53 [IST]
English summary
Honda, the world's leading two wheeler manufacturer has unveiled the new 2012 Honda CBR 1000RR Fireblade superbike. The new model celebrates 20 years of the CBR1000 which was first launched in 1991. The 2012 Fireblade has the same engine specifications as its previous model. Honda has added new stylish exterior designs along with new features such as new alloy wheels, better suspension tuning, better looking instrument cluster and other cosmetic changes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+