స్కూటర్ల తయారీ చేపట్టాలని భావిస్తున్న యమహా

Yamaha
యువతలో యమహా బైక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ రోడ్లపై ఆర్ఎక్స్ 100 బైక్ కనిపిస్తే.. పక్కన హర్లీడేవిడ్‌సన్ బైక్ ఉన్నా కూడా మన కళ్లు ఆటమేటిక్‌గా యమహా మీదకే వెళ్తాయనడంలో అతిశయోక్తి లేదేమో..! భారత మార్కెట్లో మోటార్‌సైకిల్ విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను, బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చుకున్న యమహా స్కూటర్లను అందిస్తే ఎలా ఉంటుంది. ఇప్పటి వరకూ అబ్బాయిలకే మాత్రమే పరిమితమైన యమహా బ్రాండ్ అమ్మాయిలకు లభిస్తే ఎలా ఉంటుంది..?

యమహా ఏంటి స్కూటర్లను తయారు చేయడమేంటి అనుకుంటున్నారా...? అదే చెబుతున్నా... భారత మార్కెట్లో స్కూటర్ల విభాగంలో పెద్దగా పోటీదారులు లేకపోవడం, మొన్నటి స్కూటర్ల విభాగంలో రారాజుగా ఉన్న బజాజ్ ఈ విభాగం నుంచి పూర్తిగా తొలగిపోవడం, మార్కెట్లో స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండటం.. ఆ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకొని యమహా ఈ విభాగంపై కన్నేసినట్లు తెలుస్తుంది.

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఓ ఆటో ప్రదర్శనలో స్కూటర్లు తయారుచేయాలన్న తన మనసులో మాటను ఇండియా యమహా మోటార్ నేషనల్ బిజినెస్ హెడ్ పంకజ్ దూబే బయటపెట్టారు. అయితే స్కూటర్ల తయారీ ఎలా ఉంటుంది, భారత్‌లో ఎలాంటి మోడళ్లను ప్రవేశపెట్టాలి, వీటి ఉత్పత్తికి సంబంధించిన కాల వ్యవధి వంటి పలు అంశాలపై కంపెనీ అధ్యయనాలు చేస్తుంది. అయితే భారత్‌లో మాత్రం ఖచ్చితంగా స్కూటర్లను ప్రవేశపెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలని మనం కూడా యమహాకు ఆల్‌ది బెస్ట్ చెబుదామా..!!

More from DriveSpark

Article Published On: Thursday, February 17, 2011, 17:09 [IST]
English summary
Yamaha has been contemplating to ride into the scooter segment in India and simultaneously the company’s Business Head has made some cry to the government here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+