బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిళ్లలో ఇక నుంచి ఏబిఎస్ తప్పనిసరి

BMW Motorbikes
లగ్జరీ కార్లతో పాటు లగ్జరీ మోటార్‌సైకిళ్లకు కూడా ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ కలిగిన జర్మన్ ఆటోమొబైల్ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇకపై తాము తయారు చేయనున్న అన్ని బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిళ్లకు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను తప్పనిసరి చేయనున్నట్లు పేర్కొంది. గత కొద్ది కాలం వరకూ ప్రిమీయం కార్లకు మాత్రమే పరిమితమైన ఏబిఎస్ ఫీచర్‌ను ఇటీవలి కాలంలో మోటార్‌సైకిళ్లకు కూడా అమర్చడం జరుగుతోంది. ఈ వ్యవస్థను తమ బైక్‌లకు ఓ స్టాండర్డ్‌గా పరిగణిస్తామని బిఎమ్‌డబ్ల్యూ వివరించింది. దీంతో యావత్ ప్రపంచంలోనే ఏబిఎస్‌ను ఓ స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా అందిస్తున్న మొట్టమొదటి కంపెనీగా బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ యూఎస్ఏ నిలువనుంది.

కాగా.. భారత్‌లో కూడా ఇటీవలే టీవీఎస్ మోటార్ కంపెనీ ఏబిఎస్ వ్యవస్థ కలిగిన తొలి దేశీయ మోటార్‌సైకిల్‌ అపాచీ ఆర్‌టిఆర్ 180ను ప్రవేశపెట్టింది. అలాగే తాజాగా విడుదలైన హోండా సిబిఆర్ 250ఆర్ కూడా ఏబిఎస్ సిస్టమ్‌తో లభిస్తుంది. అత్యవసర సమయంలో ఎంత వేగంగా బ్రేక్‌ వేసినా ప్రమాద రహితంగా వాహనం ఆగడమే కాకుండా.. బ్రేకింగ్‌ దూరం సాధ్యమైనంత తగ్గించడం ఈ ఏబిఎస్ ప్రత్యేకత. అన్ని రకాల వాతావరణాల్లోనూ, రహదారి పరిస్థితుల్లోనూ వాహనం నడిపేవారి భద్రతకు ఏబిఎస్ చక్కటి భరోసానిస్తుంది. ప్రతి వాహనానికి ఏబిఎస్ వ్యవస్థను అమర్చి గలిగినట్లయితే.. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 20, 2011, 17:11 [IST]
English summary
BMW Motor rad USA announced that it is mandate ring the ABS (Anti-lock Braking System) in all upcoming motorcycles. It added, the company is going make this feature as a standard equipment in its entire range of bikes. With this BMW Motor rad USA becomes the first motorcycle company in the world to offer ABS as a standard fitment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+