స్టీల్‌బర్డ్ నుంచి కార్బన్ ఫైబర్ అండ్ ఫ్లిప్-ఆఫ్ హెల్మెట్స్

Steelbird Carbon Fiber Helmet
పల్లె అయినా సరే పట్టణమైనా సరే.. ద్విచక్ర వాహనంపై రైడ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ (శిరస్త్రాణం) ధరించడం తప్పనిసరి. ఇతరుల కోసం కాకుండా స్వీయ రక్షణ కోసం హెల్మెట్‌ను ధరించడం ఉత్తమ బైక్ రైడర్ లక్షణం. ఊరికే ఫార్మాలిటీ కోసం హెల్మెట్‌ను ధరించామంటే సరిపోదు. మనం ధరించిన హెల్మెట్ సరైనదో కాదో.. అత్యవసర సమయాల్లో మనల్ని రక్షిస్తుందో లేదో కూడా తెలుసుకోగలగాలి. ఎల్లప్పుడు కూడా రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై విక్రయించే హెల్మెట్‌లను మాత్రం కొనుగోలు చేయకండి.

ఇదంతా సరే.. మనం ఇప్పుడు చెప్పుకోబోయే హెల్మెట్ కాస్తంత ఖరీదైనదే. అయితే, అంతే సురక్షితమైనది మరియు సౌకర్యమైనది కూడాను. హెల్మెట్‌ల అమ్మకాలలో ప్రముఖ బ్రాండ్ అయిన స్టీల్‌బర్డ్ దేశీయ మార్కెట్‌కు తొలిసారిగా 'కార్బన్ ఫైబర్ హెల్మట్‌'లను పరిచయం చేసింది. అసలు కార్బన్ ఫైబర్ అంటే ఏంటనే కదా మీ సందేహం. కార్బన్ దారాలను సేకరించి వాటిని సూపర్‌హీట్ చేస్తే ఏర్పడే ధృఢమైన పదార్థమే కార్బన్ ఫైబర్. ఇది చాలా తేలికగా ఉండి, అధిక ధృఢత్వంతో ఎక్కువ కాలం మన్నుతుంది.

అయితే, ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న కార్బన్ ఫైబర్ హెల్మెట్లు కాస్తంత ఖర్చుతో కూడుకున్నవే. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దేశీయ మార్కెట్లో విక్రయిస్తారు. కార్బన్ ఫైబర్ హెల్మెట్లపై అధిక దిగుమతి సుంఖం కారణంగా భారత్‌కు వచ్చే సరికి వీటి ధరలు అధికంగా ఉంటాయి. స్టీల్ బర్డ్ ఈ కార్బన్ ఫైబర్ హెల్మెట్‌ను రూ. 10,000/- ప్రారంభ ధరతో అందిస్తోంది. అంతేకాకుండా.. ఎస్‌బి 2020 అనే ఫ్లిప్-ఆఫ్ మోడల్ హెల్మెట్‌ను కూడా స్టీల్‌బర్డ్ విడుదల చేసింది.

ఈ మోడల్ ధర రూ. 2,999/-గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్‌బర్డ్ అవుట్‌లెట్లలో ఈ రెండు మోడళ్లు లభ్యం కానున్నాయి. ఈ హెల్మెట్లలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ రెండింటిలో ఉన్న ఇంటీరియర్స్‌ పాడైపోయినప్పుడు మార్చుకోవచ్చు. ఈ రెండు హెల్మెట్లు కూడా ఎక్స్‌ట్రా స్మాల్ (XXS) సైజ్ నుంచి ఎక్స్‌ట్రా లార్జ్ (XXL) సైజ్‌ వరకూ లభ్యం అవుతాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 4, 2011, 14:07 [IST]
English summary
India's one of the leading helmet manufacturer, Steelbird, has introduced Carbon Fiber Helmets with an affordable price tag. The Company also introduced a flip off helmet. Steelbird carbon fibre helmets starting price at Rs. 10,000 onwards and the flip-off model SB2020 priced at Rs. 2,999.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+