ఆండ్రాయిడ్, ఐఫోన్ అప్లికేషన్‌తో మీ కారు మీ అరచేతుల్లోనే..!

కారును ఎవరైనా దొంగిలిస్తే, పరుగు పరుగున పోలీస్ స్టేషన్ వెళ్లనవసరం లేకుండానే, మీ కారు ఏ రూట్లో ప్రయాణిస్తుందో తెలుసుకొని అప్రమత్తం చేయచ్చు. ఈ అప్లికేషన్ 2012 నాటికి అందుబాటులోకి వస్తుందని వోల్వో వెల్లడించింది. ఈ అప్లికేషన్‌కు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఐస్టోర్, ఆండ్రాయిడ్ స్టోర్‌ల నుంచి దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. అన్ని వెర్షన్ల ఐఫోన్లకు మరియు ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇది సరిపోతుందని వోల్వో తెలిపింది. భారత్‌లో కూడా ఈ అప్లికేషన్‌ను త్వరలో అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications








