ఏప్రిల్ నెల ద్విచక్ర వాహన విక్రయాలలో హీరో హోండా నెం.1

దేశీయ రెండవ అతిపెద్ద ద్వచక్ర వాహన తయారీదారు అయిన బజాజ్ ఆటో లిమిటెడ్ ఏప్రిల్ నెల విక్రయాలలో ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచింది. ఏప్రిల్ 2011లో కంపెనీ మొత్తం 3,22,235 యూనిట్లను విక్రయించి 16.71 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 2,76,095 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
అలాగే.. మరో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటార్స్ ఇండియా ఏప్రిల్ నెల విక్రయాలలో 38.1 శాతం వృద్ధిని సాధించినట్లు కంపెనీ సిఈఓ హిరొయుకి సుజుకి వెల్లడించారు. ఈ నెలలో కంపెనీ మొత్తం విక్రయాలు 24,968 యూనిట్ల నుంచి 34,476 యూనిట్లకు పెరిగాయి.
కాగా.. టీవీఎస్ మోటార్ కంపెనీ ఏప్రిల్ నెలలో మంచి విక్రయాలను నమోదు చేసుకుంది. ఏప్రిల్ 2011లో కంపెనీ విక్రయాలలో 14 శాతం వృద్ధిని సాధించి మొత్తం 1,67,744 యూనిట్లను విక్రయించిది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 1,47,172 యూనిట్లుగా ఉన్నాయి.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. లి. (ఎస్ఎమ్ఐపిఎల్) ఏప్రిల్ నెల విక్రయాలలో 41 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్ 2011లో కంపెనీ మొత్తం విక్రయాలు 20,758 యూనిట్ల నుంచి 29,369 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








