విదేశీయ ఆటో కంపెనీలకు భారత్‌పై ఎందుకంత ప్రేమ..?

Indian Auto Industry
ప్రపంచ దేశాలకు ధీటుగా మన భారతదేశం అన్ని రంగాల్లోనూ ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేసుకుంటూ అందరిచేత శభాష్ అనిపించుకుంటుంది. మనదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగాలలో ఆటోమొబైల్ రంగం కూడా ఒకటి. మనదేశపు ఆటోమొబైల్ రంగం యొక్క వృద్ధిని గమనిస్తున్న ప్రపంచ దేశాలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు క్యూ కడుతున్నారు.

ఇంతగా విదేశీయ కంపెనీలను ఆకట్టుకున్న భారత ఆటోమొబైల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..!!

* భారతదేశం ప్రపంచంలో కెల్లా రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్.
* భారతదేశం ప్రపంచంలో కెల్లా నాల్గన అతిపెద్ద వాణిజ్య వాహన మార్కెట్.
* భారతదేశం ప్రపంచంలో కెల్లా 11వ అతిపెద్ద ప్యాసింజర్ కార్ మార్కెట్.
* 2016 సంవత్సరం నాటికి మనదేశం ఏడవ అతిపెద్ద కార్ మార్కెట్‌గా ఎదుగుతుందని అంచనా.
* బలమైన ఉత్పత్తి సామర్థ్యం.

అంతేకాకుండా.. ప్రస్తుతం అమ్మకాల పరంగా గమనిస్తే.. భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, రెండవ అతిపెద్ద ప్యాసింజర్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా.

అలాగే, భారత లగ్జరీ కార్ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ నెంబర్ వన్ స్థానంలోనూ, మెర్సిడెస్ బెంజ్ ద్వితీయ స్థానంలోనూ ఉంది.

ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) ప్రథమ స్థానంలోనూ, బజాజ్ ఆటో లిమిటెడ్ ద్వితీయ స్థానంలోనూ ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 12, 2011, 12:46 [IST]
English summary
India is on every major global automobile player's road map. Because India is the second largest two-wheeler market in the world. Fourth largest commercial vehicle market in the world. 11th largest passenger car market in the world and its expected to be the seventh largest by 2016.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+