విదేశీ మార్కెట్లలో బజాజ్‌ను ముందుకు నడుపుతున్న పల్సర్

Bajaj Pulsar
అంతర్జాతీయంగా పెరుగుతున్న తమ ప్రాతినిధ్యం ద్వారా రానున్న మూడు నాలుగేళ్ళలో 20 లక్షల యూనిట్లను ఎగుమతి చేయగలమని, పూణేకు చెందిన భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ (బిఏఎల్) పేర్కొంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 10 లక్షలకు పైగా ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మిడిల్-ఈస్ట్ మరియు సౌత్-ఈస్ట్ ఏషియన్ మార్కెట్ల నుంచి ప్రధానంగా డిమాండు పెరిగినందువల్ల ఈ విజయం సాధించినట్లు కంపెనీ ప్రకటించింది.

"మార్చి 2011తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బజాజ్ ఆటో 12 లక్షలకు పైగా యూనిట్లను ఎగుమతి చేసింది. వచ్చే మూడు నాలుగేళ్లలో 20 లక్షల మార్కును తాకగలదని నేను భావిస్తున్నాన"ని బజాజ్ ఆటో లిమిటెడ్ చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌ కంపెనీ వార్షిక నివేదిక 2010-11లో వెల్లడించారు. 'గ్లోబలైజ్‌ ఇండియా' పేరిట తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించడం సంస్థ చరిత్రలో మైలురాయని, ఇదే ప్రోత్సాహంతో ముందుకు సాగుతామని ఆయన అన్నారు.

గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ విదేశీ ఎగుమతులు 35 శాతం వృద్ధిని సాధించి 12,03,718 యూనిట్లను విక్రయించింది. ఈ ఎగుమతుల ద్వారా రూ. 4,552 కోట్ల ఆదాయం వచ్చిందని, అంతకు ముందు ఇదే సంవత్సరంతో పోలిస్తే ఇది 28.5 శాతం అధికమని కంపెనీ పేర్కొంది. కాగా.. ఆఫ్రికా మార్కెట్‌ తమకు అత్యంత కీలకమైన, నైజీరియా, ఉగాండా, కెన్యా, అంగోలా తదితర మార్కెట్లలో కూడా అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని వీటిలో ఎక్కువగా పల్సర్‌ రేంజ్‌ స్పోర్చ్స్ బైక్‌లే అధికంగా అమ్ముడవుతున్నాయని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 16, 2011, 10:42 [IST]
English summary
India's second largest two-wheeler manufacturer Bajaj Auto Limited (BAL) aims to export over 2 million units in the next three to four years on the back of its increasing international footprints.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+