కొత్త పల్సర్ ఎఫెక్ట్..: తగ్గుముఖం పట్టిన బజాజ్ సేల్స్!

పల్సర్, డిస్కవర్ బ్రాండ్ బైక్‌లు బజాజ్ ఆటో నుండి అత్యధికంగా అమ్ముడువుతున్న మోడళ్లు. కాగా.. పల్సర్ బ్రాండ్‌ను మార్కెట్‌కు పరిచయం చేసిన 10 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ఈ బ్రాండ్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేస్తానని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవలే ప్రకటించారు. అంతేకాకుండా.. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా అత్యాధునిక ఇంజన్ టెక్నాలజీతో కొత్త పల్సర్‌ను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.
దీంతో కొనుగోలుదారులు ఏకంగా కొత్త పల్సర్‌నే సొంతం చేసుకుందామనే ఉద్దేశ్యంతో ప్రస్తుతానికి పల్సర్‌ను కొనాలనుకు ఆలోచనకు గుడ్‌బై చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ, గడచిన అక్టోబర్ నెలలో బజాజ్ ఆటో విక్రయాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. అక్టోబర్ 2011లో కంపెనీ 3,51,083 యూనిట్లను విక్రయించి 6.46 శాతం వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. గడచిన ఇదే నెలలో 3,29,776 యూనిట్లను విక్రయించినట్లు బజాజ్ ఆటో ఓ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications








