తొలి త్రైమాసికంలో 20% పెరిగి బజాజ్ ఆటో నికర లాభం

Bajaj Avenger
ఆటోమొబైల్ దిగ్గజం మరియు భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ (బిఏఎల్) ఈ ఆర్థిక సంవత్సరం (2011-12)లో తొలి త్రైమాసికపు స్టాండ్అలోన్ నెట్ ప్రాఫిట్‌లో 20.48 శాతం వృద్ధిని సాధించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 711,06 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2010-11)లో ఇదే కాలానికి కంపెనీ నికర లాభం రూ. 590.15 కోట్లుగా ఉన్నట్లు బజాజ్ ఆటో ఓ ప్రకటనలో పేర్కొంది.

అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండ్అలోన్ నికర అమ్మకాలు 22.73 శాతం పెరిగి రూ. 4,586.91 కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నికర అమ్మకాలు 3,737.29 కోట్లుగా ఉన్నాయి.

ఇదే సమయంలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 8,28,391 యూనిట్ల నుంచి 9,63,051 యూనిట్లకు పెరిగి 16 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. అలాగే, వాణిజ్య వాహనాలు 99,918 యూనిట్ల నుంచి 1,29,764 యూనిట్లకు పెరిగి 30 శాతం వృద్ధిని కనబరిచాయి. ఇక తొలి త్రైమాసికంలో మొత్తం అమ్మకాలను గమనిస్తే.. 9,28,336 యూనిట్ల నుంచి 10,92,815 యూనిట్లకు పెరిగి 18 శాతం పెరుగుదలను రికార్డు చేశాయి.

More from DriveSpark

Article Published On: Thursday, July 14, 2011, 15:24 [IST]
English summary
Bajaj Auto, India's second largest two-wheeler manufacturer has reported its first quarter financial results. The company has said its net profit had increased by 20 per cent to 711 crore. It had previously reported first quarter net profit of Rs.590.15 crore during last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+