స్పోర్ట్స్ సెగ్మెంట్‌పై దృష్టి సారించనున్న బజాజ్ ఆటో

Pulsar 220CC
స్పోర్ట్స్ సెగ్మెంట్‌పై దృష్టి సారించనున్నట్లు భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ప్రకటించింది. ఈ విభాగంలో 50 శాతం మార్కెట్ వాటాను ఆర్జిచాలని కంపెనీ భావిస్తోంది. పల్సర్ బైక్ ద్వారా స్పోర్ట్స్ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్నామని, ఆ విభాగంపై మరింత దృష్టి సారించనున్నామని బజాజ్ ఆటో అధ్యక్షుడు (మోటార్‌సైకిల్ వ్యాపారం) ఎస్ శ్రీధర్ వెల్లడించారు. మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో ప్రస్తుతం బజాజ్ ఆటో 27 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఈ వాటాను మరో 3-4 శాతానికి పెంచుకోవాలని భావిస్తున్నామని శ్రీధర్ తెలిపారు. భారత మార్కెట్ కోసం హై-ఎండ్ వేరియంట్ బైక్‌లను అభివృద్ధి చేసే బాధ్యతను బజాజ్ కెటిఎమ్ చేపట్టిందని, ఈ ఏడాది ముగిసే నాటికి వారి బైక్‌లను ప్రవేశపెట్టవచ్చునని ఆయన చెప్పారు. కాగా.. ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాలకు ఏటా 80,000 బైకులను కంపెనీ ఎగుమతి చేస్తుందని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, April 21, 2011, 16:51 [IST]
English summary
Country's second largest two-wheeler maker Bajaj Auto said it will focus on the sports segment. "We are at the top of the sports segment with Pulsar and want to focus on that segment", Bajaj Auto President (motorcycles business) S Sridhar said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+