చెన్నై మార్కెట్లో భారత్ బైక్‌ను విడుదల చేసిన బజాజ్ ఆటో

Boxer BM 150
దేశీయ ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రత్యేకించి రూరల్ మార్కెట్ కోసం తక్కువ ధరతో అధిక శక్తిని కలిగి ఉండేలా రూపొందించిన "బాక్సర్ బిఎమ్ 150 సీసీ" అధికారికంగా శుక్రవారం చెన్నై మార్కెట్లో విడుదల చేసింది. కొత్త బాక్సర్ మోటార్‌సైకిల్ గురించి వన్ఇండియా ఆటోమొబైల్ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మా విలువైన రీడర్లుకు తెలియజేస్తూనే ఉంది.

బజాజ్ ఆటో తాజాగా.. తన కొత్త బాక్సర్‌ను తమిళనాడు మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.చంద్రశేఖర్ మాట్లాడుతూ కొత్త బాక్సర్ 150 సీసీ బైక్‌ను 'భారత్ బైక్' స్థానంలో ప్రవేశపెట్టామని, వివిధ రకాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించడంలో భాగంగా ఈ కొత్త బైక్‌ను రూపొందించామని అన్నారు.

గ్రామీణ రోడ్లపై 100 సీసీ బైక్‌లు అంత సమర్థవంతంగా పనిచేయని నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త బైక్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. బాక్సర్ 150 సీసీ బైక్ యొక్క ఇంజన్ 12 పిఎస్‌ల శక్తిని మరియు 12.26 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి సాధారణ 100 సీసీ బైక్‌తో పోల్చుకుంటే సుమారు 50 శాతం అధికం. దీని ఎక్స్-షోరూమ్ చెన్నై ధర రూ. 43,247.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలను 100 సీసీ బైక్‌లే డామినేట్ చేస్తున్నాయని, అయితే తమ కొత్త భారత్ బైక్ గతుకుల రోడ్లపై ఎవరైతే సౌఖ్యమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకుంటారో అలాంటి వారిని ఆకట్టుకుంటుందని చంద్రశేఖర్ అన్నారు. అక్టోబర్ నెల నుండి ప్రతి నెలా సుమారు 30,000 భారత్ బైక్‌లను విక్రయించగలమని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, September 3, 2011, 8:44 [IST]
English summary
Bajaj Auto, the Indian two-wheeler manufacturer has launched the new Boxer BM 150 in Tamil nadu market t the price of Rs.43,247 (ex-Chennai showroom). The Boxer 150cc's engine would deliver 12 PS power and 12.26 NM torque, nearly 50 per cent more than the standard 100cc bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+