ఊసరవెల్లిలా రంగులు మార్చే బజాజ్ డిస్కవర్ 100 సీసీ బైక్

Bajaj Discover
భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ (బిఏఎల్) అందిస్తున్న అత్యధికంగా అమ్ముడయ్యే డిస్కవర్ వేరియంట్‌లో మరో సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. 2011వ ఎడిషన్ "బజాజ్ డిస్కవర్ 100సీసీ" మోటార్‌సైకిల్‌ను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2004వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన డిస్కవర్ మోడల్ ఇప్పటి వరకూ 40 లక్షల బైక్‌లు అమ్ముడైన సందర్భంగా బజాజ్ ఈ 100 సీసీ బైక్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

కొత్తగా విడుదల చేసిన బజాజ్ డిస్కవర్ 100 సీసీ మల్టీ కలర్ ఆప్షన్లతో సరికొత్త లుక్‌ను ఇస్తుందని, ఇది గోల్డ్ గ్రీన్, రెడ్ మాజెంటా అనే రెండు ఆప్షన్లలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఉన్న మరో కీలక ఫీచర్ ఆటో కలర్ ఛేంజ్. ఈ ఆటో కలర్ ఛేంజ్ ఫీచర్ వివిద కోణాల్లో పరిశీలించినప్పుడు వివిధ రంగులలో ఈ బైక్ దర్శనమిస్తుంది.

మోటార్‌సైకిల్ పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా ఈ ఆటో కలర్ ఛేంజ్ ఫీచర్‌ను తామే పరిచయం చేస్తున్నట్లు బజాజ్ ఓ ప్రటనలో వెల్లడించింది. మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర 100 సీసీ బైక్‌ల కన్నా బజాజ్ డిస్కవర్ 100 సీసీ బైక్ అధికంగా లీటరు పెట్రోల్‌కు 80 మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. డిస్కవర్ 100 సీసీ బైక్‌కు సంబంధించిన ధర ఇతర సాంకేతిక వివరాలను తెలియాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 24, 2011, 18:46 [IST]
English summary
The second largest two wheeler-maker, Bajaj Auto launched its 2011 edition of Discover 100cc bike in Indian market. The company said that it has sold more than 40 lakhs Discover brand motor-cycles since its launch in 2004.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+