ఇదివరకెన్నడూ లేనంతగా మే నెల విక్రయాలు: బజాజ్ ఆటో

Bajaj Pulsar 135CC
పల్సర్, డిస్కవర్ బ్రాండ్‌లు బజాజ్ ఆటో పేరును ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఒకటేమో స్పోర్ట్స్ బైక్, మరొకటేమో బడ్జెట్ బైక్. స్టైలిష్ లుక్, స్పోర్టీ టచ్ కోరుకునే వారి కోసం బజాజ్ అందిస్తున్న పల్సర్ బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా 50కు పైగా దేశాలలో లభ్యమవుతోంది. పల్సర్ బైక్ 150 సీసీ, 180 సీసీ, 220 సీసీ పవర్‌ఫుల్ ఇంజన్‌తో మూడు వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాకుండా.. పవర్, మైలేజ్ మరియు స్టైల్ ఈ మూడు ఫీచర్లు కోరుకునే వారికోసం ఇటీవలే ఈ బ్రాండ్‌లో 135 సీసీ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది. అలాగే డిస్కవర్‌ బ్రాండ్‌లో కంపెనీ 100 సీసీ, 150 సీసీ బైక్‌లను అందిస్తుండగా.. తాజాగా ఈ రెండింటికి మధ్యలో 125 సీసీ బైక్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. గడచిన మే నెలలో కూడా కంపెనీ మొత్తం విక్రయాలలో అధికంగా ఈ రెండు బ్రాండ్‌లే ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

మే, 2011లో కంపెనీ మొత్తం మోటార్‌సైకిల్ విభంగాలో 18 శాతం వృద్ధిని సాధించి 3,17,989 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో ఈ విక్రయాలు 2,69,488 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా మే 2011లో కంపెనీ ఎన్నడూ లేనివిధంగా అత్యధికంగా మే నెల ఎగుమతులను నమోదు చేసుకుంది. ఈ నెలలో మొత్తం 1,26,818 యూనిట్ల ద్విచక్ర వాహనాలు ఎగుమతి అయ్యి 32.15 శాతం వృద్ధిని కనబరిచాయి. మే 2010లో ఇవి కేవలం 95,964 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహన విభాగంలో కూడా కంపెనీ మంచి విక్రయాలను ప్రకటించింది. గత నెలలో మొత్తం 40,860 ఆటోలను విక్రయించి 36.41 శాతం వృద్ధిని సాధించగా, అంతకుముందు ఏడాది ఇదే సమయానికి 29,954 యూనిట్లను విక్రయించగలిగింది.

More from DriveSpark

Article Published On: Thursday, June 2, 2011, 15:42 [IST]
English summary
The country's second largest two-wheeler maker Bajaj Auto posted its highest ever motorcycle sales for May at 3,17,989 units in last month, registering a jump of 18%. The company had sold 2,69,488 units in the corresponding month last year, Bajaj Auto Ltd (BAL) said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+