అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేసుకున్న బజాజ్

అంతకు ముందు సంవత్సరంలో ఇదే నెలలో కంపెనీ అమ్మకాలు 3,29,364 యూనిట్లుగా ఉన్నట్లు బజాజ్ ఆటో ఓ ప్రకటనలో పేర్కొంది. మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో అమ్మకాలు 17 శాతం వృద్ధి చెంది 2,89,176 యూనిట్ల నుంచి 3,38,054 యూనిట్లకు పెరగాయి. వీటిల్లో అత్యధికంగా పల్సర్ మరియు డిస్కవర్ బ్రాండ్లే సుమారు 65 శాతం వాటాను కలిగి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఒక్క నెలలో ఇంత అత్యధిక సంఖ్యలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు నమోదు కావడం కూడా ఇదే మొదటిసారి. ఇకపోతే కంపెనీ వాణిజ్య వాహన అమ్మకాలు కూడా గతేడాది ఆగస్టు నెలతో పోల్చుకుంటే 11 శాతం వృద్ధి చెంది 40,188 యూనిట్ల నుంచి 44,685 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో ఎగుమతులు కూడా 40 శాతం పెరిగి 98,578 యూనిట్ల నుంచి 138,225 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








