బాక్సర్‌లో అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్న బజాజ్

1997లో విడుదలైన బజాజ్ బాక్సర్ దాని ధృఢత్వం, అద్భుతమైన పెర్ఫామెన్స్‌ల కారణంగా అప్పటి మార్కెట్లో ఓ సంచలనం సృష్టించింది. కానీ.. 2007లో బజాజ్ ఆటో బాక్సర్ విక్రయాలను నిలిపివేసి, దాని స్థానంలో ప్లాటినా మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీ తాజాగా విడుదల చేయబోయే బాక్సర్ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్, 125 సీసీ ఇంజన్‌తో లభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 125 సీసీ విభాగంలో పోటీపడుతున్న హీరో హోండా సూపర్ స్పెండర్, హోండా షైన్, యమహా వైబిఆర్ 125, సుజుకి స్లింగ్ షాట్ మోడళ్లకు బజాజ్ బాక్సర్ సమాధానం చెప్పగలదని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








