బాక్సర్ విక్రయాలను పునఃప్రారంభించనున్న బజాజ్ ఆటో..!?

Bajaj Auto
భారత ద్విచక్ర వాహన దిగ్గజం హీరో హోండా ప్రారంభ మోడల్ "సీడీ డాన్"కు గట్టి పోటీ ఇవ్వడానికి దేశీయ రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు అయిన బజాజ్ ఆటో మరుగున పడిపోయిన తమ బజాజ్ బాక్సర్ బైకు విక్రయాలను పునరుద్దరించనున్నట్లు సమాచారం. ద్విచక్ర వాహన కంపెనీలు చవక ధరలకే విక్రయిస్తున్న ప్రారంభ మోడళ్లకు గిరాకీ ప్రోత్సాహకరంగా ఉన్న నేపథ్యంలో బాక్సర్‌ను పునఃప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు బజాజ్ ఆటో సీఈఓ ఎస్ శ్రీధర్ తెలిపారు. అయితే తాజాగా ప్రవేశపెట్టనున్న బజాజ్ బాక్సర్ ధరను, దాని సాంకేతిక వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

పల్సర్, డిస్కవరీ మోడళ్లపై మరింత దృష్టిని సారిస్తూనే.. బాక్సర్ విక్రయాల పునఃప్రారంభంలో భాగంగా తక్కువ సంఖ్యలో బాక్సర్‌ బైకులను, అలాగే అతి త్వరలోనే కెటిఎమ్ మోడల్‌ మోటార్‌ సైకిల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. మోటార్ సైకిల్ విభాగంలో ప్రారంభ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఆటోమొబైల్ తయారీ దారుల సంఘం (ఎస్ఐఏఎమ్) తెలిపిన వివరాల ప్రకారం.. 60 శాతానికి పైగా మొత్తం దేశీయ మోటార్ సైకిల్ విక్రయాలలో ప్రారంభ మోడల్ వాహనాలు 24 శాతానికి విస్తరించి 66 లక్షల యూనిట్లకు పెరిగాయి.

గత 2007లో బాక్సర్ విక్రయాలను బజాజ్ ఆటో నిలిపివేసి, దాని స్థానంలో ప్లాటినా బైకును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్లాటినా ఆరంభంలో రాణించినంత మెరుగ్గా తర్వాతి కాలంతో రాణించలేక విఫలమైంది. అప్పట్లో ప్లాటినా ధర సుమారు రూ. 35,300లుగా ఉండగా హీరో హోండా ప్రవేశపెట్టిన సీడీ డాన్ ధర సుమారు రూ. 33,500గానూ, ఇదే సమయంలో టీవీఎస్ మోటార్ సంస్థ ప్రవేశపెట్టిన స్టార్ సిటీ ధర రూ. 39,200గా ఉండటంతో మార్కెట్‌ పోటీని తట్టుకోలేక ప్లాటినా వెనుకబడిపోయింది. ఈ విభాగంలో లోటును భర్తీ చేసుకోవడానికి బజాజ్ మరోసారి బాక్సర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 18, 2011, 8:40 [IST]
English summary
Bajaj Auto plans to restart sales of its Boxer motorcycle by April as it seeks to boost volumes for a second bid to challenge Hero Honda’s CD Dawn entry-level model. “Boxer will be launched in the commuter space, where there is a strong boom,” chief executive (two wheelers) of Bajaj Auto, S Shridhar, told to Financial Chronicle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+