ఫర్వాలేదనిపించిన బజాజ్ ఆటో జులై అమ్మకాలు

గత నెలలో మొత్తం మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 14 శాతం పెరిగి 3,18,095 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 2,79,781 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న వాణిజ్య వాహనాలు 18 శాతం వృద్ధితో 38,634 యూనిట్ల నుండి 45,617 యూనిట్లకు పెరిగాయి. అలాగే, బజాజ్ ఆటో జులై నెల ఎగుమతులు కూడా 35 శాతం మేర పెరిగి గతేడాది జులై నెలతో పోలిస్తే.. 1,06,794 యూనిట్ల నుంచి 1,43,996 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








