సెప్టెంబర్ నెలలో 18 శాతం పెరిగిన బజాజ్ సేల్స్

Bajaj Sales
భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్‌ ఆటో అందిస్తున్న పల్సర్ డిస్కవర్ మోటార్‌సైకిళ్లకు ఇటు దేశీయ మార్కెట్లోనే కాకుండా అటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో కంపెనీ అమ్మకాలు జోరందుకున్నాయి. గడచిన సెప్టెంబర్‌ నెల అమ్మకాలలో బజాజ్ ఆటో 18 శాతం పెరుగుదలను నమోదు చేసుకున్నట్లు పేర్కొంది.

అంతేకాకుండా ఇదే నెలలో రికార్డు స్థాయిలో ఎగుమతులను కూడా తమ ఖాతాలో వేసుకొంది. సెప్టెంబర్ 2011లో కంపెనీ మొత్తం 4,17,686 యూనిట్లను విక్రయించగా.. వాటిలో 1,41,913 యూనిట్లను ఎగుమతి చేసినట్లు పేర్కొంది.

గతేడాది ఇదే సమయంలో బజాజ్ ఆటో అమ్మకాలు మొత్తం అమ్మకాలు 3,52,769 యూనిట్లు గానూ ఎగుమతులు 1,01,960 యూనిట్లను గానూ ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే త్రీ-వీలర్‌ అమ్మకాలు కూజా 21.50 శాతం పెరిగి గతేడాది ఇదే నెలలో పోలిస్తే 38,254 యూనిట్ల నుండి 46,478 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ తాజాగా గ్రామీణ మార్కెట్ల కోసం పునఃప్రవేశపెట్టిన బజాజ్ బాక్సర్‌కు మార్కెట్ల నుండి మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 4, 2011, 16:41 [IST]
English summary
India’s second-largest two-wheeler maker Bajaj Auto reported an 18 per cent increase in sales in September to 4,17,686 units. The Company sold 3,52,769 units in the corresponding month last year, Bajaj Auto said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+