రూ. 43,000 లకే కొత్త బాక్సర్‌ను విడుదల చేసిన బజాజ్!

కొత్త బాక్సర్‌ను 150 సీసీ డిటిఎస్-ఐ ఇంజన్‌తో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని తీర్చిదిద్దారు. పాత బాక్సర్ డిజైన్‌ను తలపించేలా ఉండే కొత్త బాక్సర్ బిఎమ్ 150 ఫ్యూయెల్ ట్యాంక్‌పై బజాజ్ లోగో లేకుండా దీనిని డిజైన్ చేశారు. బజాజ్ ఆటో అందిస్తున్న డిస్కవర్ బ్రాండ్ మోటార్‌సైకిల్ ధర కన్నా రూ. 7,000 తక్కువగా ఉండేలా దీని ధరను రూ. 43,000 (ఎక్స్-షోరూమ్, పూణే)గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత బజాజ్ డీలర్ల వద్ద కొత్త బాక్సర్ లభ్యం కానుంది. ఎటువంటి రోడ్లపై అయినా సౌకర్యంగా ప్రయాణించేలా విశాలమైన సీట్లు, పటిష్టమైన ఛాస్సిస్, శక్తివంతమైన హెడ్‌లైట్స్ వంటి ఎన్నో ఫీచర్లతో దీన్ని రూపొందిచడం జరిగింది. కొత్త బాక్సర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వన్ఇండియా ఆటోమొబైల్ త్వరలో మీ ముందు ఉంచుతుంది.


Click it and Unblock the Notifications








