బజాజ్ బాక్సర్ బిఎమ్ 150 ఫీచర్లు, ప్రత్యేకతలు

New Boxer 150
పల్సర్ బ్రాండ్ బైక్‌లతో స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న బజాజ్ ఆటో, చెప్పినట్లుగానే గ్రామీణ ప్రాంత రహదారుల కోసం మరియు అక్కడ నివసించే ప్రజలకు సౌకర్యవంతమైన సుఖవంతమైన ప్రయాణ అనుభుతిని కల్పించేందుకు శక్తితోపాటు మైలేజ్‌ను కూడా ఇచ్చే విధంగా సరికొత్త బాక్సర్ బిఎమ్ 150 సీసీ బైక్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

బజాజ్ నుంచి తొలుత వచ్చిన బాక్సర్‌కు రూరల్ ప్రాంతం నుండే అర్బన్ ప్రాంతాల నుండి కూడా మంచి ఆదరణ ఉండేది. అయితే, మారుతున్న కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను అందిచడంలో భాగంగా పాత బాక్సర్ ఉత్పత్తిని బజాజ్ ఆటో నిలిపివేసింది. కొత్త బాక్సర్ బిఎమ్ 150సీసీ బైక్‌ డిజైన్‌లో పాత్ బాక్సర్ బేసిక్ డిఎన్ఏ మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

కొత్త బాక్సర్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకుండా, దీని ఇంజన్‌ను శక్తివంతగా తీర్చిదిద్దారు. బాక్సర్ 150 సీసీ ఇంజన్ 12 పిఎస్‌ల శక్తిని మరియు 12.26 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. గ్రామీణ రహదారులపై సౌకర్యంగా సవారీ చేసేందుకు విశాలమైన సీటును మరియు అధిక బరువు తీసుకువెళ్లేందుకు వెనుక లగేజ్ క్యారియర్‌ను కొత్త బాక్సర్‌లో అమర్చడం జరిగింది.

రైడ్ కంఫర్ట్ కోసం ఇందులో ముందువైపు టెలిస్కోపిక్ షాక్ అబ్జార్వర్లను మరియు వెనుక స్ప్రింగ్ ఇన్‌సైడ్ స్ప్రింగ్ (ఎస్ఎన్ఎస్) సిస్టమ్‌తో కూడిన షాక్ అబ్జార్వర్లను అమర్చారు. ఇది డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌తో లభిస్తుంది. కొత్త బాక్సర్ ఎలక్ట్రిక్ మరియు కిక్ స్టార్ట్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది.

ఇది 150 సీసీ బైక్ అయినప్పటికీ మైలేజ్‌లో మాత్రం ధీటుగా లీటరుకు 55-60 కి.మీ. నడుస్తుంది. ఇక భారత మార్కెట్లో దీని ధర విషయానికి వస్తే.. రూ. 43,000/- నుంచి ప్రారంభం అవుతుంది. మరికొద్ది వారాల్లోనే ఇది దేశవ్యాప్తంగా అన్ని అధీకృత బజాజ్ డీలర్ల వద్ద లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 3, 2011, 18:18 [IST]
English summary
Bajaj Boxer 150 is aimed at the rural market in the slot previously occupied by the Yezdi and Rajdooth. Bajaj has made several changes to the engine to suit rural conditions. The chassis is more robust to take on uneven road conditions. Bajaj has added the electronic starter system.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+