చిన్న కారు ప్రాజెక్టును నిలిపివేయలేదు: బజాజ్ ఆటో

Bajaj Ultra Low-cost Car
రీనాల్ట్ మరియు నిస్సాన్ అలయన్స్ కోసం భారత ఆటో దిగ్గజం బజాజ్ ఆటో రూపొందిస్తున్న ఆల్ట్రా లో-కాస్ట్ కారు ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలను కంపెనీ తోసిపుచ్చింది. ఈ చిన్న కారు ప్రాజెక్టు ఆర్థికంగా తమకు లాభాలను చేకూర్చబోదని, మార్జిన్లు తక్కువగా ఉండే ఈ ప్యాసింజర్ కార్ వ్యాపారంలోకి ప్రవేశించాలనుకోవడం లేదని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్‌ను ఉటంకిస్తూ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంపై కంపెనీ స్పందించింది.

బజాజ్-రీనాల్ట్-నిస్సాన్ ప్రాజెక్టు ఖచ్ఛితంగా నడుస్తోందని బజాజ్ ఆటో సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్) ఎస్ రవి కుమార్ స్పష్టం చేశారు. తమ కొత్త ఫోర్-వీలర్ ఫ్లాట్‌ఫామ్ ఇటు వాణిజ్య మరియు అటు ప్యాసింజర్ వాహనల కోసం ఉపయోగించుకోవచ్చని, దీన్ని జనవరి 2012లో రీనాల్ట్-నిస్సాన్‌లకు చూపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యం చౌక కారు అయిన టాటా నానోకు పోటీ ఇచ్చేందుకు బజాజ్ ఆటో స్వంతంగా ఈ కారును అభివృద్ధి చేస్తోంది.

ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుండి బజాజ్ ఆల్ట్రా లో-కాస్ట్ కారు అవాంతరాలు, అపోహల మరియు ఎన్నో విమర్శలను ఎదుర్కుంటోంది. ఈ కారును పూర్తిగా బజాజ్ ఆటో తన స్వంత టెక్నాలజీతో త్రీ-వీలర్లను తయారు చేయడంలో ఉన్న అనుభవాన్ని జోడించి రూపొందిస్తోంది. ఒక్కసారి ఈ కారు పూర్తి దశలో ఉత్పత్తి అయిన తర్వాత దీని మార్కెటింగ్ కార్యకలాపాలను దేశీయ మరియు విదేశీయ ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రీనాల్ట్ మరియు జపాన్ కార్ల దిగ్గజం నిస్సాన్ కంపెనీలు చేపట్టనున్నాయి. అయితే, ఈ ఆల్ట్రా లో-కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ రెండు విదేశీ సంస్థలకు బజాజ్ ఏలాంటి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వనట్లు తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 16, 2011, 13:40 [IST]
English summary
Bajaj Auto Ltd (BAL) has said, reports about its Ultra Low-cost car project being shelved were not true. Bajaj Auto's senior vice-president for business development S Ravi Kumar said, the project was on and Nissan-Renault were still part of it.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+