నింజా 650ఆర్ ప్రోబైక్‌ను విడుదల చేసిన బజాజ్-కవాసకి

NINJA 650R
గత కొద్ది నెలలుగా బైక్ లవర్స్‌ను ఊరిస్తున్న కవాసకి నింజా 650ఆర్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లోకి అరంగేట్రం చేసింది. దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో మరియు దాని జపాన్ భాగస్వామి కవాసకి కంపెనీలు భారత మార్కెట్లో మరో సూపర్‌బైక్‌ను ప్రవేశపెట్టాయి. ఈ జాయింట్ వెంచర్ అందిస్తున్న నింజా బ్రాండ్‌లో కొత్తగా మరో ప్రోబైక్‌ను బుధవారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 650సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన 'కవాసకి నింజా 650ఆర్', బైక్‌ను పుణే మార్కెట్లో 'ఇండియా కవాసాకి' మేనేజింగ్ డైరెక్టర్ యోషిరో సెగావా ఆవిష్కరించారు.

నింజా 650ఆర్ ప్రోబైక్ 72 పిఎస్‌ల శక్తిని కలిగి ఉండి 66 ఎన్ఎమ్‌ల టార్క్‌తో గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో నింజా 650ఆర్ ధర రూ. 4.57 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ట్రిపుల్ పెటల్ డిస్క్ బ్రేకులు, మోటోజిపి డిస్‌ప్లే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన లైట్స్, ఇంజన్ కిందిభాగంలోనే ఫిక్స్ చేసిన సైలెన్సర్, ట్విన్ సిలిండర్ ఇంజన్ వంటి ఆధునిక ఫీచర్లతో రూపుదిద్దుకున్న నింజా 650ఆర్ 91 ఆక్టేన్ ఫ్యూయెల్‌తో నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 30 ప్రధాన నగరాల్లోని బజాజ్ ప్రొబైకింగ్ షోరూమ్‌లలో నింజా 650ఆర్ లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Thursday, June 9, 2011, 10:33 [IST]
English summary
Country's second largest two-wheeler maker Bajaj Auto and its Japan partner Kawasaki launched its pro biking offering Ninja 650R in Indian premium motorcycles market. The Ninja 650R with a power of 72 PS and a torque of 66 Nm is priced at Rs 4.57 lakh (ex-showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+