డిస్కవర్ 125సీసీ బైక్‌ను విడుదల చేసిన బజాజ్ ఆటో

Bajaj Discover
భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ అందిస్తున్న డిస్కవర్ బ్రాండ్‌లో మరో సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. బైక్‌ల మిడ్ సెగ్మెంట్‌లో వాటాను మరింతగా పెంచుకునే లక్ష్యంగా 125 సీసీ విభాగంలో "డిస్కవర్ 125 సీసీ" అనే మోటార్‌సైకిల్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. దీంతో బజాజ్ డిస్కవర్ బ్రాండ్‌లో అందిస్తున్న 150 సీసీ, 100 సీసీ విభాగల మధ్యన 125 సీసీ కూడా చేరినట్లయింది. 125 సీసీ విభాగంలో బజాజ్ ప్లాటినా, బజాజ్ ఎక్స్‌సిడి బైక్‌లను కూడా కంపెనీ అందిస్తున్న విషయం తెలిసిందే.

డిటిఎస్‌ఐ (డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్) టెక్నాలజీతో రూపొందిన ఈ బైక్ ధరను రూ. 45,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. డిస్కవర్ మోడల్‌లో బజాజ్ అందిస్తున్న డిస్కవర్ 150సీసీ, డిస్కవర్ 100సీసీ బైక్‌లకు మంచి ఆదరణ లభిస్తుందని, అయితే ఇటు మైలేజ్‌ను అటు శక్తి (పవర్)ని కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని డిస్కవర్ 125సీసీ బైక్‌ను ప్రవేశపెడుతున్నామని బజాజ్ ఆటో అధ్యక్షుడు (మోటార్‌సైకిల్ బిజినెస్) ఎస్ శ్రీధర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

డిస్కవర్ 100సీసీ రూ. 43,500, డిస్కవర్ 150సీసీ రూ. 49,500 ధరలతో లభిస్తుండగా... డిస్కవర్ 125సీసీ బైక్ రూ. 45,500 ధరతో లభిస్తుందని కంపెనీ వివరించింది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2011- మార్చి 2012) ద్వితీయ త్రమాసికంలో బాక్సర్ బైక్‌ను మరోసారి మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తుంది. పల్సర్, 125 సీసీ సెగ్మెంట్ బైక్‌లపై కంపెనీ దృష్టి సారించేందుకు 2007లో బాక్సర్ ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Friday, April 1, 2011, 11:36 [IST]
English summary
The country’s second largest two wheeler maker Bajaj Auto has just launched its new version of Discover for Rs45500. The bike comes with a 125cc engine and DTSi-technology coupled with unprecedented mileage and power output. Hence it becomes the ideal vehicle for those who need mileage and driving power, said its President for Auto.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+