ఈజిప్ట్‌లో కొత్త బాక్సర్ బైక్‌ను విడుదల చేసిన బజాజ్

Bajaj Boxer in Ezypt
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ తాజాగా ప్రవేశపెట్టిన 150 సీసీ మోటార్‌సైకిల్ బజాజ్ బాక్సర్‌ను కంపెనీ ఈజిప్ట్‌ మార్కెట్లో కూడా విడుదల చేసింది. ఈజిప్షియన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బజాజ్ తమ కొత్త బాక్సర్ డిజైన్, టెక్నాలజీలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి విడుదల చేసింది.

బాక్సక్ 150 మోటార్‌సైకిల్‌లో ఎక్సాస్ టెక్ టెక్నాలజీని ఉపయోగించారు. అంతేకాకుండా ఈజిప్ట్‌లో అత్యంత ప్రాచుర్యమైన పిరమిడ్ల సాక్షిగా బజాజ్ ఓ మారథాన్‌ను కూడా నిర్వహించింది. బాజాజ్ బాక్సర్ మోటార్‌సైకిల్ యొక్క నాణ్యత, పటిష్టతలను చాటి చెప్పేందుకు మొత్తం 15 బజాజ్ 150 సీసీ బాక్సర్ బైక్‌లతో ఈజిప్ట్ మొత్తం 13 రోజుల పాటు 2,500 కిలోమీటర్ల మేర బజాజ్ ఓ మారథాన్ నిర్వహించింది.

కాగా.. మనదేశ మార్కెట్లో బజాజ్ ఆటో ఆగస్టు నెలలో ఈ కొత్త బాక్సర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి భారతీయ గ్రామీణ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని బజాజ్ రూపొందించిన ఈ బాక్సర్ ఎక్స్-షోరూమ్ హైదరాబాద్ ధర రూ.43,009 లుగా ఉంది. మంచి రోడ్ గ్రిప్ కోసం వెడల్పాటి టైర్లు, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎలక్ట్రిక్ స్టార్ట్, విశాలమైన సీట్లను ఇందులో అమర్చారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 17, 2011, 16:54 [IST]
English summary
The Bajaj Boxer 150, India's Bharath bike has now gone international. The latest utility bike has been launched in Egypt. The two wheeler manufacturer has said the Boxer will be an ideal bike for a country like Egypt. The Boxer 150 has been customized to suit Eqypt's conditions.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+