హైదరాబాద్‌లో కొత్త బాక్సర్ బైక్‌ను విడుదల చేసిన బజాజ్

వెడల్పాటి టైర్లు, ఎలక్ట్రిక్ స్టార్ట్, విశాలమైన సీట్‌తో వస్తున్న కొత్త బాక్సర్ 150 సీసీ బైక్ యొక్క ఇంజన్ 12 పిఎస్‌ల శక్తిని మరియు 12.26 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి సాధారణ 100 సీసీ బైక్‌తో పోల్చుకుంటే సుమారు 50 శాతం అధికం. దీని ఎక్స్-షోరూమ్ హైదరాబాద్ ధర రూ.43,009 యూనిట్లుగా కంపెనీ నిర్ణయించింది. ప్రతి నెలా సుమారు 30,000 భారత్ బైక్‌లను విక్రయించగలమని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలను 100 సీసీ బైక్‌లే డామినేట్ చేస్తున్నాయని, అయితే తమ కొత్త భారత్ బైక్ గతుకుల రోడ్లపై ఎవరైతే సౌఖ్యమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకుంటారో అలాంటి వారిని ఆకట్టుకుంటుందని చంద్రశేఖర్ చెప్పారు. గ్రామీణ రోడ్లపై ఇది లీటరు పెట్రోల్‌కు 55 నుంచి 62 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని, కొత్త బాక్సర్ కోసం ఇప్పటికే 60కిపైగా బుకింగ్స్ వచ్చాయని ఆయవ వెల్లడించారు.


Click it and Unblock the Notifications








