అమ్మకపు లక్ష్యాన్ని చేజార్చుకోనున్న బజాజ్ ఆటో...!!

అయితే ఇదే సమయంలో ఎగుమతులు మాత్రం అంచనాలకు మించి జరిగాయని, ఏడాది ప్రారంభంలో 10 లక్షలను యూనిట్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా అవి 12 లక్షలకు పెరిగాయని, దేశీయ విక్రయాల లోటును ఈ ఎగుమతులు భర్తీ చేయగలిగినప్పటి విక్రయాలు మాత్రం ఆశించిన రీతిలో జరగలేదని ఆయన చెప్పారు. 2010 మూడో త్రైమాసికంలో లాభాలు రూ. 667.11 కోట్లుగా నమోదవ్వగా 2009 మూడో త్రైమాసికంలో లాభాలు రూ. 475.14 కోట్లుగా ఉన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం (2010-11) తొలి త్రైమాసికం (ఏప్రిల్ 2010-జూన్ 2010)లో మొత్తం విక్రయాలు 9,28,000గా ఉండగా.. రెండో త్రైమాసికం (జులై 2010-సెప్టెంబర్ 2010)లో 10,00,000ల యూనిట్లుగా ఉన్నాయి. ఇకపోతే మూడో త్రైమాసికం (అక్టోబర్ 2010-డిసెంబర్ 2010)లో కంపెనీ విక్రయాలు 9,46,850 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక ఉత్పత్తి విషయానికి వస్తే.. ఈ ఏడాది మొత్తం 50 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నామని అందులో 45 లక్షల ద్విచక్ర వాహనాలను, 50,000 త్రిచక్ర వాహనా(ఆటో)లను ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించినట్లు బజాజ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








