త్వరలో కెటిఎమ్ 200 డ్యూక్‌ను విడుదల చేయనున్న బజాజ్

KTM 200 Duke
బజాజ్ ఆటో అందిస్తున్న స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ 'పల్సర్' భారత మార్కెట్లో విడుదలై పది వసంతాలు పూర్తి కావస్తుండటంతో వినియోగదారులు కొత్తదనాన్ని పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది. పల్సర్ బ్రాండ్‌తో 150, 180, 220 సెగ్మెంట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బజాజ్ ఆటో, త్వరలోనే భారత మార్కట్లోకి మరో సరికొత్త 250 సీసీ పల్సర్ బైక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే, దీనికంటే ముందుగా 'కెటిఎమ్ 200 డ్యూక్' మోటార్‌సైకిల్‌ను ఈ అక్టోబర్ నెలలోనే దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇటీవల మలేషియా మార్కెట్లో 'కెటిఎమ్ 200 డ్యూక్' మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన బజాజ్ ఆటో తాజాగా బ్రెజిల్ మార్కెట్లో కూడా ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ బైక్‌ను తొలుతగా వచ్చే జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో విడుదల చేయాలని కంపెనీ భావించింది.

పరిశ్రమ వర్గాల సమాచారం నిజమే అయితే, ఈ నెలలోనే కెటిఎమ్ 200 డ్యూక్ మోటార్‌సైకిల్ భారత రోడ్లపై పరుగులు తీయనుంది. పూణే ఉత్పత్తి కేంద్రంలో బజాజ్ ఆటో ఈ బైక్‌ను తయారు చేస్తుంది. ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్‌ల తయారీ సంస్థ కెటిఎమ్ కంపెనీలో బజాజ్ ఆటో 40 శాతం వాటాను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, October 10, 2011, 14:03 [IST]
English summary
Austrian sports bike maker KTM and India's second largest two-wheeler maker Bajaj Auto Ltd, jointly developed first motorcycle 200cc Duke would launch in India this October, sources said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+