పోటీ హీరోతో కాదు హోండాతోనే..: బజాజ్ ఆటో

Bajaj Pulsar
దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రగామిగా ఉండే హీరో హోండా రెండు కంపెనీలుగా విడిపోవడంతో మార్కెట్లో వాతావరణం నానాటికీ వేడెక్కుతోంది.ఇప్పటి వరకూ బజాజ్ కంపెనీకు హీరో హోండా మాత్రమే అతిపెద్ద పోటీదారుగా ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ కంపెనీ రెండుగా విడిపోవడంతో బజాజ్ ఆటో నెంబర్ వన్ స్థానంపై కన్నేసింది. తాజాగా బజాజ్ జపాన్‌కు చెందిన హోండా కంపెనీకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అటు పవర్‌ను, ఇటు మైలేజ్‌ను దృష్టిలో పెట్టుకొని బజాజ్ అందిస్తున్న పల్సర్ మరియు డిస్కవర్ బ్రాండ్‌లకు దేశంలోనే కాక ప్రపంచ మార్కెట్లలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత మార్కెట్ కోసం మళ్లీ స్కూటర్లను తయారు చేయాలను ఆలోచనను కూడా కంపెనీ పక్కకు పెట్టింది.

అమ్మకాల పరంగా దేశీయ రెండవ అతిపెద్ద ద్విచక్ర-వాహన కంపెనీ అయిన బజాజ్ ఆటో భారత మార్కెట్లో హోండా కంపెనీ పావులు కదపడానికి కంటే ముందుగానే చెక్ పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం టెలివిజన్లలో వస్తున్న బజాజ్ పల్సర్ వాణిజ్య ప్రకటనను గమనించినట్లయితే, "భారత్‌లో ఏ జపనీస్ స్పోర్ట్స్ బైక్ కన్నా కూడా ఐదు రెట్లు ఎక్కువగా అమ్ముడవుతున్న బ్రాండ్ బజాజ్" అని కంపెనీ ప్రచారం చేస్తోంది. పల్సర్ బైక్‌ను ఈ ప్రకటన వినియోగదారులకు మరింత చేరువ చేస్తుంది. పటిష్టమై పోటీదారు (హోండా) తమను అటాక్ చేయకముందే, ఇక్కడ మరింత స్థిరత్వాన్ని పొందాలనుకుంటున్నామని బజాజ్ ఆటో మార్కెటింగ్ జిఎమ్ మిలింద్ బేడ్ తెలిపారు.

బజాజ్ టివి ప్రకటనలో జపనీయులు 'హుంతో'.. 'హుంతో'.. అని ఆశ్యర్యంగా అనటం చూస్తాం. జపాన్ భాషలో హుంతో అంటే నమ్మసఖ్యంకాని అని అర్థం, ఎందుకంటే.. భారత్‌లో ఏ ఇతర జపాన్ కంపెనీ విక్రయాలు చూసిన వాటికి ఐదు రెట్లుగా బజాజ్ విక్రయాలు ఉన్నట్లు కంపెనీ చెప్పుకుంటుంది. ఈ విషయంపై మార్కెట్ నిపుణులు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బజాజ్‌కు హీరో నుంచి ముప్పు ఉండబోదని కానీ ఖచ్చితంగా హోండా నుండి ఉంటుందని వారు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో లీడర్‌గా ఎదగాలంటే, తమ దృష్టిని ఎక్కువగా విదేశీ మార్కెట్లపైనే కాకుండా కొంచెం స్వదేశీ మార్కెట్‌పై కూడా ఉంచి మరిన్ని కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకర్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, June 16, 2011, 12:33 [IST]
English summary
Experts says that, India's second largest two-wheeler maker Bajaj Auto is no longer competing with Hero Honda in India; Because the company has spitted as Two companies. Now Bajaj to face huge competition from Japanese motorcycle maker Honda.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+