రీనాల్ట్-నిస్సాన్‌లకు భారీ షాక్ ఇచ్చిన బజాజ్ ఆటో!

తక్కువ మార్జిన్లు కలిగిన ప్యాసింజర్ కార్ వ్యాపారంలోకి కంపెనీ ప్రవేశించాలని భావించడం లేదని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ చెప్పినట్లు ఆ పత్రిక ప్రచురించింది. లో-కాస్ట్ ప్యాసింజర్ కారుకు బదులుగా ఓ లో-కాస్ట్ కమర్షియల్ వెహికల్‌ను విడుదల చేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. గతేడాదిలో భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటోతో రీనాల్ట్-నిస్సాన్ అలయన్స్ భారత మార్కెట్ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం ఓ ఆల్ట్రా లో-కాస్ట్ కారును తయారు చేసేందుకు ఈ మూడు సంస్థల మధ్య ఓ అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ) కుదురింది. వాస్తవానికి ఈ కారు 2012లో విడుదల కావాల్సి ఉంది.
ఈ ఒప్పందంలో భాగంగా ఈ చౌక కారుకు సంబంధించి డిజైన్ మరియు తయారీ బాధ్యలు బజాజ్ నిర్వహిస్తుండగా, రీనాల్ట్ మరియు నిస్సాన్ సంస్థలు భారత్‌లోనూ అలాగే ఇతర విదేశీ మార్కెట్లలోనూ మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. దీనికి సంబంధించి నిస్సాన్ అధికార ప్రతినిధి సిమోన్ స్ప్రౌలే మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు విషయంలో నిర్ణయం తీసుకునేందుకు భాగస్వాములు సమస్యలను ఎదుర్కుంటున్నారని, రానున్న వారాల్లో దీనిపై కంపెనీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని అన్నారు.


Click it and Unblock the Notifications








