'భారత్ బైక్'గా మార్కెట్లోకి రానున్న 150cc బజాజ్ బాక్సర్!!

Bajaj Boxer
గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నట్లుగా.. బజాజ్ ఆటో మరోసారి ఒకప్పటి ఫ్లాగ్‌షిప్ మోడల్ మోటార్‌సైకిల్ అయిన "బాక్సర్‌"ను మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే అచ్చం ఇదివరకటి బాక్సర్‌ను కాకుండా దాన్ని అప్‌గ్రేడ్ చేసి ఆధునిక హంగులు అద్ది మరీ విడుదల చేయనుంది. అంతేకాదండోయ్.. 150 సీసీ ఇంజన్‌తో రూపొందిస్తున్న ఈ మోటార్‌సైకిల్‌కు బజాజ్ ఆటో పెట్టనున్న పేరేంటో తెల్సా..!? "భారత్ బైక్". బాక్సర్ బైక్‌కు గతంలో రూరల్ మార్కెట్లలో ఎంతో మంచి పేరు ఉంది. ఇప్పటికీ కొందరు వినియోగదారులు బాక్సర్‌ను ఉపయోగిస్తున్నారు. పెర్ఫామెన్స్, పవర్, మైలేజ్, మెయింటినెన్స్ వంటి విషయాల్లో బజాజ్ బాక్సర్ వినియోగదారుల మది దోచుకుంది.

దేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు అయిన బజాజ్ ఆటో, 150 సీసీ విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో బజాజ్ స్కూటర్లను పునఃప్రవేశపెట్టాలన్న బజాజ్ సంస్థ అధినేత రాహుల్ బజాజ్ ఆలోచనను కూడా ఆయన తనయుడు రాజీవ్ బజాజ్ పక్కనపెట్టారు. అర్బన్ మార్కెట్లలో ఎక్కువగా దర్శనమిచ్చేవి 150 సీసీ బైకులే, అలాగే రూరల్ మార్కెట్లలో 100-125సీసీ బైకులు రాజ్యమేలుతున్నాయి. ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన బజాజ్ తన కొత్త భారత్‌ బైక్‌ను రూ. 40,000 ప్రైస్ ట్యాగ్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలోనే విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. భారత్ బైక్ మెయిన్ టార్గెట్ రూరల్ మార్కెట్లే.

తక్కువ ధరకే 150 సీసీ బైక్ లభించడం కారణంగా రూరల్ మార్కెట్లో వీటి వినియోగం పెరిగే అవకాశం ఇంది. నగరాల్లో ఎలాగో.. 150 సీసీ బైక్‌లంటే క్రేజ్ ఉండటం, దానికి తోడు చౌక ధరకే లభించడంతో ఈ బైక్ వినియోగం భారీగా పెరిగే సూచనలున్నాయి. "అర్బన్ ప్రాంతాల్లో అప్‌మార్కెట్ కస్టమర్ల కోసం దేశీయ బైక్‌లైన పల్సర్, డిస్కవర్ మోడళ్లు ఉన్నాయి. కానీ టూ-వీలర్ విభాగంలో చిన్న చిన్న పట్టణాలు, ప్రాంతాల్లో సౌకర్యవంతమైన, శక్తివంతమైన రవాణ సదుపాయం కోరుకునే ప్రజలు చాలా మంది ఉన్నారు. వీరి అవసరాలను తీర్చే విధంగా బాక్సర్‌ను డిజైన్ చేశాం" అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ బిజినెస్ లైన్ పత్రికకు తెలిపారు. మరి భారత్ బైక్‌ను ఇదివరకటి బాక్సర్‌లా భారత ప్రజలు ఆదరిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 24, 2011, 11:38 [IST]
English summary
Bajaj Auto is all set to relaunch its once flagship model Bajaj Boxer motorcycle very soon in domestic market. The all new Bajaj Boxer may renamed as Bharat Bike, which comes with a 150 cc engine at the price tag of Rs. 40,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+