గ్రామాల్లో మా తఢాఖా చూపిస్తాం: బజాజ్ ఆటో

దీనితో పాటు మరో మోడల్ బాక్సర్ 150 సీసీ బైక్‌ను దీన్ని ట్యాంక్ ఆన్ టూ వీల్స్‌గా సంబోధిస్తారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి గ్రామీణ మార్కెట్లో విడుదల చేస్తారు. తమ సర్వేలో గ్రామీన వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని స్పష్టంగా తెలిసింది. వారంతా మైలేజీ ఎక్కువతో పాటు, భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ప్రధానంగా వాహనాల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా చూడమంటున్నారని బజాజ్ ఆటో లిమిటెడ్ (బీఎఎల్) అధ్యక్షుడు (మోటార్‌సైకిల్) ఎస్ శ్రీధర్ చెప్పారు.
తమ కంపెనీ ఉత్పత్తులు ప్రధానంగా డిస్కవరి గ్రామీణ మార్కెట్లలో ఎక్కువగా విక్రయిస్తున్నారని.. ప్రజల్లో ఇప్పుడు మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయని వారు కొత్త మోడళ్లతోపాటు భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రతి నెల విక్రయించే 1.3 లక్షల యూనిట్ల డిస్కవరీ వాహనాల విషయానికి వస్తే 45 శాతం 125 సీసీ, 150 సీసీ కాగా మిగిలినవి 100 సీసీ బైక్‌లని శ్రీధర్ చెప్పారు. సంవత్సరం క్రితం మార్కెట్లో విక్రయించే 95 శాతం బైక్‌లు 100 సీసీవేనని ఆయన అన్నారు. రాబోయే మూడు నెలల్లో ఈ నిష్పత్తి పెరిగి 50:50కి చేరుకుంటుందని డిస్కవరీ 125 సీసీ, 150 సీసీలు 100 సీసీ బైక్‌లను దాటిపోతాయని ఆయన వివరించారు.
ఈ ఏడాది 3 లక్షల మోటార్‌బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. డిస్కవరీతో పాటు పల్సర్ మోడల్‌ను గ్రామీణ మార్కెట్లో విడుదల చేస్తామని చెప్పారు. గ్రామీణ మార్కెట్ బాగా పుంజుకుంటోందని దేశంలోని అమ్మకాల్లో మొత్తం 60 శాతం బైక్‌లు గ్రామీణ మార్కెట్లలోని విక్రయిస్తున్నామని 2010-11 ఆర్థిక సంవత్సరంలో మోటార్‌బైక్‌ల అమ్మకాల్లో 22.86 శాతం వృద్ధితో 90,19,090 యూనిట్లు విక్రయాలు జరిగాయని అంతకు ముందు ఏడాది 2009-10లో 73,41,122 యూనిట్ల విక్రయాలు జరిగాయని శ్రీధర్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








