తిరిగి రోడ్లపై పరుగులు తీయనున్న హమారా బజాజ్ స్కూటర్

ఒకప్పట్లో స్టేటస్ సింబల్‌గా నిలిచిన బజాజ్ స్కూటర్లు తర్వాతి కాలంలో ఆటో రంగంలో చోటు చేసుకున్న పలు విప్లవాత్మక మార్పుల కారణంగా కాలగమనంలో కలిసిపోయి చరిత్రలో నిలిచిపోయాయి. ఈ స్కూటర్లకు ఆదరణ పూర్తిగా తగ్గిపోవడంతో కంపెనీ కూడా వీటి తయారీని ఆపివేసింది. అయితే "ఓల్డ్ ఈజ్ గోల్డ్" అన్న సామెత బజాజ్ స్కూటర్లపై చక్కగా పనిచేసినట్లుంది. అంతే కాకుండా చాలా మంది వాహన ప్రియులు "హమారా బజాజ్‌" గళాన్ని మరోసారి వినిపించడంతో పాటు బజాజ్ స్కూటర్లను తిరిగి రోడ్లపై చూడాలనే ఆసక్తి కనబరచడంతో బజాజ్ ఆటో కంపెనీకు శుభసంకేతం లభించినట్లయింది. ఈ నేపథ్యంలో కంపెనీ తిరిగి బజాజ్ స్కూటర్ల ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తోంది.

హమారా బజాజ్ అంటూ ఓ రెండు దశాబ్దాల పాటు భారతీయ స్కూటర్ మార్కెట్లో సంచలనం సృష్టించిన బజాజ్ స్కూటర్‌ను అప్పట్లో కొనుగోలు చేయాలంటే డీలర్ వద్ద ముందుగా బుక్ చేసుకోవాలి. కానీ.. అప్పటికే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ఆ స్కూటర్ ఇంటికి వచ్చిందంటే ఇక సంబరమే. అప్పట్లో బజాజ్ స్కూటర్‌ను కొనడమే గర్వంగా భావించేవారు. మధ్య తరగతి ప్రజలకైతే ఇది మహారథమే అని చెప్పాలి. 1960లో రాజస్థాన్‌కు చెందిన "రాహుల్ బజాజ్" అనే ఓ యువ పారిశ్రామిక వేత్త బజాజ్ స్కూటర్లకు ప్రాణం పోశారు. ఇటలీ కంపెనీ నుంచి తెచ్చుకున్న ఆజ్ఞాపత్రం (లైసెన్స్)తో స్కూటర్ల తయారీకి శ్రీకారం చుట్టారు.

తాను రూపొందించిన స్కూటర్లకు ఇంత ఆదరణ లభిస్తుందని అప్పట్లో రాహుల్ కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు. ఆ క్రెడిట్ ఒక్క హమారా బజాజ్‌కే దక్కుతుంది. వెస్పా, చేతక్, సూపర్ వంటి ఎన్నో మోడళ్లను రాహుల్ ఆవిష్కరించి ఆటోమొబైల్ రంగంలో ఒక కొత్త శకానికి తెరలేపారు. అయితే తాజాగా రాహుల్ బజాజ్ మరోసారి స్కూటర్ల తయారీపై దృష్టి సారించారు. ఇదే గనుక జరిగితే మరోసారి సరికొత్త హంగులతో కూడిన బజాజ్ స్కూటర్లను మనం చూడొచ్చన్నమాట.

కానీ..ఇక్కడ ఓ చిన్న సమస్య ఉంది, అదేంటంటే.. ఈ స్కూటర్ల తయారీపై రాహుల్ బజాజ్ తనయుడు రాజీవ్ బజాజ్ మాత్రం ఇందుకు సుముఖంగా లేరని సమాచారం. మరి ఈ ప్రయోగం ఎంత వరకూ విజయం సాధిస్తుందో.. భారత ప్రజలతో మరోసారి హమారా బజాజ్ అనిపిస్తారో లేదో.. వేచి చూడక తప్పదు...! దీనిపై మీ అభిప్రాయాలను కింద ఇచ్చిన కామెంట్ బాక్స్‌లో మాతో పంచుకోండి.

More from DriveSpark

Article Published On: Saturday, February 12, 2011, 14:53 [IST]
English summary
The Indian iconic Hamara Bajaj scooter that shaped the personal travel segment in the 1960s may going to hit the Indian roads again. The chairman of Bajaj Auto who adored the famous Vespa scooters made by Piaggio of Italy and in 1960 was interested brinch back these scooters again.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+