మహారాష్ట్రను వదలి వేరే రాష్ట్రానికి వెళ్తాం: బజాజ్ ఆటో

గత ఐదు త్రైమాసికాల నుంచి బజాజ్ ఆటోకు మహారాష్ట్ర సర్కారు చెల్లించాల్సిన రూ. 1,100 కోట్ల సేల్స్ టాక్స్ (అమ్మకపు పన్ను)ను రీఫండ్ చేయకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర సర్కారు ఈ మొత్తాన్ని బజాజ్ ఆటోకు వ్యాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్) అకౌంట్‌పై చెల్లించాల్సి ఉంది. చివరి ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఏప్రిల్ 30, 2010వ తేదీన రాష్ట్రప్రభుత్వం చెల్లించింది. "ఒకవేళ మాహారాష్ట్ర ప్రభుత్వం ఇలాగే నియమరహితంగా వ్యవరించడం కొనసాగిస్తే, మరో రాష్ట్రాన్ని వెతుక్కోక తప్పద"ని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ చెప్పారు
చాకన్ ప్రాంతంలో తీవ్రమైన కార్మిక సమస్య ఉందని ఆయన గుర్తుచేస్తూ, గుజరాత్ ప్రభుత్వం పరిశ్రమకు క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని, గుజరాత్‌కు వెళ్లడాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం బజాజ్ ఆటోకు మహారాష్ట్రలోని ఛాకన్ ప్లాంటులో రెండు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. అందులో ఒకటి ఔరంగాబాద్ మరొకటి పంత్ నగర్‌లో ఉన్నాయి. ఈ రెండు ప్లాంట్లు కూడా పూర్తిస్థాయి ఉత్పత్తి (ఏటా 50 లక్షలు)ని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాయి. అయితే, బజాజ్ ఆటో ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండుకు మరియు మార్కెట్ పరిమాణానికి అనుగుణంగా సమీప భవిష్యత్తులో కంపెనీ విస్తరణ కార్యకలాపాలు చేపట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు వైఖరిపై కంపెనీ గుర్రుమంటోంది.


Click it and Unblock the Notifications








